సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడుతున్నారనే ప్రచారం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. జగ్గారెడ్డిలాంటి సీనియర్ నేతను కోల్పోయిన పక్షంలో పార్టీ ఉనికికి ఉమ్మడి మెదక్ జిల్లాపై కూడా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్ కు చెందిన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలని అధికార పార్టీ తనవైపు ఫిరాయించుకున్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ మనుగడ కష్టసాధ్యమవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. పటాన్ చెరు, నర్సాపూర్, సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడిని పార్టీ వీడకుండా చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డితో భేటీ అయి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఈ భేటీలో బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలారు. మీ లాంటి నేతలు పార్టీని వీడొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... తానో కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చేస్తున్న పట్ల పార్టీ నాయకత్వం స్పందించకపోవడం బాధించిందన్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా.. తనపై ఇలాంటి ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
పైగా తానేదీ మాట్లాడినా పార్టీకి నష్టం జరుగుతోందని మాట్లాడటం కూడా తనను బాధిస్తోందన్నారు. పేరు కోసమే ఎంతో కష్టపడుతూ వచ్చానని... తన పేరునే లేకుండా చేసే కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయని.. ఈ తరుణంలో తాను సాధించి పెట్టుకున్న మంచి పేరుకు కూడా మసకబారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన పేరే లేనప్పుడు పార్టీలో కొనసాగడమెందుకని ప్రశ్నించారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్‌లకు లేఖలు రాసినా.. వారి నుంచి స్పందన లేదన్నారు. పార్టీలో కొనసాగేది లేనిది ఇవాళ వెల్లడిస్తానన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. జగ్గారెడ్డి కార్యకర్తలకు, పేదోళ్లకు అండగా ఉండే నేత అన్నారు. గతంలో రూ.7 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించారని గుర్తుచేశారు. అలాంటి నేత పార్టీని వీడటం మంచిది కాదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా టీపీసీసీ చీఫ్ అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని అన్నారు. తాజా భేటీ సందర్భంగా జగ్గారెడ్డి-వీహెచ్ కొద్దిసేపు చెవిలో గుసగుసలు చెప్పుకోవడం గమనార్హం. నీలాంటి నేతలు పార్టీలో ఉండి కొట్లాడాలని.. పార్టీని వీడొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more