MLA Jagga Reddy to decide on quitting party కాంగ్రెస్ కు భారీ షాక్.. రాజీనామా యోచనలో జగ్గారెడ్డి

Congress sangareddy mla jagga reddy to decide on quitting party

congress, jagga reddy, Sangareddy MLA, TPCC working president, former MP V Hanumantha Rao, TPCC president, A Revanth Reddy, AICC president Sonia Gandhi, sangareddy, telangana Congress, Telangana, Politics

The State unit of Congress party is likely to get a major jolt as Sangareddy MLA and TPCC working president T Jagga Reddy is set to take a decision on quitting or continuing in the party. Speaking to media persons at a private hotel here, the Sangareddy MLA said few people, who were inexperienced and not familiar with party functioning, were trying to defame him with ulterior motives.

తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్.. రాజీనామా యోచనలో జగ్గారెడ్డి

Posted: 02/19/2022 11:03 AM IST
Congress sangareddy mla jagga reddy to decide on quitting party

కాంగ్రెస్​ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన సన్నిహితులకు, పార్టీ శ్రేణులకు సమాచారం చేరవేశారు. గత కొంత కాలంగా జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. తాను కాంగ్రెస్‌ను వీడుతున్నప్పటికీ టీఆర్ఎస్‌లో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న విషయాన్ని ఇవాళ మధ్యాహ్నం తరువాత వెల్లడించే అవకాశాలు వున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న ఆయన హఠాత్తుగా ఈ మేరకు నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న విషయం తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు దిగులు చెందుతున్నారు.

గతకొద్ది రోజులుగా సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర ఆరోపణలు, తనపై యూట్యూబ్ ఛానెళ్లలో వ్యతిరేక కథనాలను ఎదుర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలకు జగ్గారెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు. రేవంత్ నియామకాన్ని మీడియా ఎదుటే వ్యతిరేకించారు. పలు మార్లు పార్టీ నేతల మధ్య జరిగిన చర్చల తర్వాత అందరితో కలిసి పనిచేస్తానని చెప్పినప్పటికీ కార్యక్రమాల్లో మునుపటిలాగా ఉత్సాహం చూపడం లేదు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచి జగ్గారెడ్డి‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చాలని జగ్గారెడ్డి కంకణం కట్టుకున్నట్టు, తాను టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా మారినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీలో ఓ వర్గం నాయకులు తనపై పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని అనుమానం వ్యక్తంచేసిన ఆయన దీనిని తాను తట్టుకోలేక పార్టీ నుంచి వీడి బయటకు వద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఎదైనా నష్టం జరిగితే దానిని తనమీద వేసే అవకాశం ఇవ్వకూడదనే తాను బయటకు రావాలని బావిస్తున్నాట్లు సమాచారం,

పార్టీ కోసం ఎంత చేసినా గుర్తింపు లేకుండా పోతున్నదని తన సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. టీవీ చర్చల్లో పాల్గొంటున్న కాంగ్రెస్​పార్టీ నాయకులు కూడా తన ప్రస్తావన రాగానే టీఆర్‌ఎస్ కోవర్టుగా అభివర్ణిస్తున్నారని ఆయన బాధపడుతున్నారు. ఉమ్మడి మెదక్​జిల్లాలో కాంగ్రెస్​పార్టీ నుంచి గెలిచిన ఎకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్​హవాను తట్టుకొని విజయం సాధించిన కాంగ్రెస్​ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తన వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles