No need for amendment to APRA: Telangana కోర్టు కేసులతోనే విభజన సమస్యలు జటిలం..

Apsfc division will not progress until ap withdraws court cases says telangana

Andhra Pradesh, Ministry of Home Affairs, AP Reorganisation Act, Sileru project, AP Genco, bifurcation issues, MHA joint secretary, Two states Finance Secretaries, Dispute Resolution Sub-Committee, Telangana, Andhra Pradesh, Politics

The State government is of the firm view that there is no need to take up amendment of the Andhra Pradesh Reorganisation Act, 2014 after seven and half years, as it will open endless litigation and further complicate the settled matters. At the first meeting of the Dispute Resolution Sub-Committee of Ministry of Home Affairs on bifurcation issues, AP sought amendments to the Act for removal of anomaly in taxation matters while Telangana opposed the same.

కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటేనే.. విభజన సమస్యల పరిష్కారం

Posted: 02/17/2022 09:57 PM IST
Apsfc division will not progress until ap withdraws court cases says telangana

ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం తొలి భేటీ సందర్భంగా విభజన చట్టంలో మార్పుల అంశం చర్చకు వచ్చింది. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేళ్ల తరువాత విభజన చట్టంలో మార్పులు తీసుకురావాలని అనుకోవడంతో ఇదివరకే పరిష్కరించబడిన పలు సమస్యలు మళ్లీ పునరావృతం అవుతాయని అభిప్రాయపడింది. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్​తో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశీష్ కుమార్ సమావేశం అయ్యారు.

ఈ భేటీలో కొన్ని కీలక సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. బకాయిల చెల్లింపునకు ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకుంటే విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి సిద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణతోనే ఏపీఎస్‌ఎఫ్‌సీ -ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన సైతం సాధ్యమని తెలంగాణ పేర్కొంది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపింది. తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ ఏకీభవించారు.

ఫలితంగా పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. రాజ్‌భవన్, హైకోర్టు నిర్వహణ బకాయిలు కూడా రాలేదని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి.. ఏపీ నగదు బకాయిల వివరాలు పంపాలని సూచించారు. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అంగీకారం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles