పెళ్లంటే సందెళ్లు, తప్పట్లు తాళాలు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు అంటారు. కానీ ఇక్కడ ఈ 54 ఏళ్ల వ్యక్తికి మాత్రం పెళ్లంటే.. కేవలం కట్నాలు, కానుకలు, మోసాలు.. వంచనలు.. ఆరు నెలల సంసారం.. ఆ తరువాత అందిన కాడికి దండుకుని ఉడాయించడం. ఇదే పనిగా పెట్టుకుని 20 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 13 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆయనకు స్వతహాగా పెద్దలు చేసిన పెళ్లితో కలుపుకుని మొత్తంగా 14 మందిని పెళ్లాడాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇలా ఏకంగా 14 మంది పెళ్లి చేసుకున్న ఆయన భాగోతాన్ని అతని 14వ భార్య బయటపెట్టింది. పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులతో ఉడాయించిన భర్తపై అమె ప్రతీకారం తీర్చుకుంది. అదెలా అన్న వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇతను ఒడిశాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటాడు. పంజాబ్, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలకు చెందిన మహిళను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలే ఇతని టార్గెట్. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని చెబుతూ మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలకు ఎర వేస్తుంటాడు. అంతేగాక బాగా చదువుకొని ఉన్నావారు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు.
ఇలా వారిని వంచించి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా వారి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతటి పనికి ఒడిగడుతుంటాడు. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్‌కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు. అయితే జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోనూ నిందితుడు షాకింగ్ నిజాలు వెల్లడించాడు.
తను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది. నిందితుని నుంచి 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామనీ నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు స్వైన్ గతంలో హైదరాబాద్‌లోనూ అరెస్టయ్యాడు. అతను సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నటిస్తూ దేశమంత అనేక మంది వ్యక్తుల నుండి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. కేరళలోని ఎర్నాకులంలో ఓకేసులోనూ అరెస్టయ్యాడు.
స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు.2018లో పంజాబ్‌కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు రూ.10 లక్షల మేర మోసం చేశాడు. అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. అయితే స్వైన్ ఐదుగురు పిల్లలకు తండ్రి కాగా అతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. అప్పటితో మొదలైన ఆయన పెళ్లి బాగోతలు 20 ఏళ్ల వరకు కొనసాగాయి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎంతో మంది మహిళలతో స్నేహం చేసి వారిని దొంగ వివాహం చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more