TDP leader Vinod Jain sent to judicial remand for 14 days టీడీపీ నేత వినోద్ జైన్ కు 14రోజుల రిమాండ్

Tdp leader vinod jain sent to judicial remand for 14 days by vijayawada magistrate court

minor girl ends life, minor girl suicide, vinod jain, vinod jain tdp, judicial custody, Bhavanipuram police, vijayawada Chief Metropolitan Magistrate’s Court, Krishna, Crime

The Bhavanipuram police arrested Vinod Jain, accused by a minor girl in her suicide note ofsexually harassingher, and produced him in the Chief Metropolitan Magistrate’s Court amidst tight security. The court remanded him to judicial custody. The accused was sent to the Machilipatnam jail.

బాలిక ఆత్మహత్య కేసులో.. టీడీపీ నేత వినోద్ జైన్ కు 14రోజుల రిమాండ్

Posted: 02/02/2022 10:49 AM IST
Tdp leader vinod jain sent to judicial remand for 14 days by vijayawada magistrate court

 బాలిక ఆత్మహత్య పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్‌కు విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. విజయవాడలో మూడు రోజుల క్రితం ఓ బాలిక ఐదంతస్థుల భవనంపై నుంచి దూకీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అమె రాసిన సూసైడ్ నోట్ బహిర్గతం అయ్యింది. అందులో తన ఆత్మహత్యకు వినోద్ జైన్ లైంగిక వేధింపులే కారణమని పేర్కోంది. దీంతో ఆయనను అరెస్టు చేసిన భవాణిపురం పోలీసులు భారీ బందోబస్తు మధ్య న్యాయస్తానానికి తరలించి మెట్రోపాలిటిన్ మెజిట్రేటు ఎదుట హాజరుపర్చారు. అనంతరం జైన్‌ను మచిలీపట్టణం జిల్లా జైలుకు తరలించారు.

నిందితుడు జైన్‌ను కోర్టులో హాజరు పరచడానికి ముందు పోలీసుల భద్రతతో ఆయనను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అతడిపై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయంగానూ పెను ప్రకంపనలు రేపింది. నిందితుడు జైన్ ను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. బాధిత బాలిక తల్లిదండ్రులతో ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, వంగలపూడి అనిత తదితరులు నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

రిమాండ్ రిపోర్టులో పోలీసులు పోందుపర్చిన అంశాలివే..
* వినోద్‌ జైన్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది
* బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు.
* బాలిక నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు.
* జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్‌మెంట్‌ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది.
* రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్‌ నోట్‌లో ఆమె  స్పష్టంగా రాసింది.
* దీంతోపాటు ఆమె సెల్‌ఫోన్, ట్యాబ్‌లో ఆ వేధింపులను పొందుపరిచింది.
* లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు.
* బాలిక తమ్ముడు విఘ్నేష్‌ (10)ను స్కూల్‌ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు కూడా తప్పిన వేధింపులు
* సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వినోద్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడు.
* ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్‌ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles