Man Uses 'Genius' Trick, Lands Job కంపెనీ ప్రకటనపైనే రెజ్యూమే.. జాబ్ కొట్టేసిన నిరుద్యోగి

Man s job application involved sticking linkedin profile on cars in parking lot

Jonathan Swift, creative job application, LinkedIn, instantprint, company’s parking lot, unique job application, LinkedIn profile, CCTV footage,Yorkshire printing specialists

Armed with flyers of his LinkedIn profile, a British man decided to apply for a job at a company’s parking lot. His unique job application was noticed and Jonathan Swift soon became the talk of the office at Yorkshire-based printing specialists Instantprint.

ITEMVIDEOS: కంపెనీ ప్రకటనపైనే రెజ్యూమే.. జాబ్ కొట్టేసిన నిరుద్యోగి

Posted: 02/01/2022 09:32 PM IST
Man s job application involved sticking linkedin profile on cars in parking lot

కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కావాలంటే వాటికి ధరఖాస్తు చేసే విధానంలోనే కొంత ప్రత్యేకత కనబర్చాలి. ధరఖాస్తుదారులో ఎంత నైపుణ్యం ఉన్నా.. దానిని కాగితంపై పెట్టి అప్లై చేసే విధానంలోనే ముందుగా ఆయా సంస్థల అధికారులను ఆకర్షిస్తాయి. వాటిలో రెజ్యూమే కీలక పాత్ర వహిస్తాయి. దాంతో వారికి వచ్చి స్పందనను బట్టి వారిలోని టాలెంట్ ను పరీక్షిస్తారు. తొలుత రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూలు దాటుకుని వెళితే అప్పుడు హెఆర్ తో సమావేశం అక్కడ వేతనభత్యాలు నిర్ణయించుకున్న తరువాత ఉద్యోగం ఖరారవుతుంది. అయితే బ్రిటన్ కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే నిరుద్యోగి తన బుర్రకు పదునుపెట్టి ఓ ఉద్యోగం సంపాదించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది.

యార్క్ షైర్ లోని ఇన్ స్టాంట్ ప్రింట్ అనే సంస్థ ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. దాంతో జోనాథన్ స్విఫ్ట్ కూడా దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంచెం పేరున్న కంపెనీ కావడంతో భారీగానే దరఖాస్తులు వస్తాయని గ్రహించిన అతగాడు, కొత్త పంథాలో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మామూలుగా రెజ్యూమే పంపితే తనను పట్టించుకోకపోవచ్చని భావించి, ఆ కంపెనీ కరపత్రాలను సేకరించి వాటిపై తన రెజ్యూమే వివరాలు పొందుపరిచాడు. ఆ కరపత్రాలను కంపెనీ ప్రధాన కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ పార్కింగ్ లో ఉన్న కార్లకు అంటించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి.

ఆ ఫుటేజిని పరిశీలించిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాస్సెల్... జోనాథన్ స్విఫ్ట్ కార్లకు అంటించిన కరపత్రాలను తెప్పించుకుని చదివాడు. అతడి క్రియేటివిటీకి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఇంటర్వ్యూకు ఎంపిక చేయడమే కాదు, ఉద్యోగం కూడా ఇచ్చేశాడు. తమకు ఇలాంటి కొత్తరకం ఆలోచనలు ఉన్నవాళ్లే కావాలని, అందుకే స్విఫ్ట్ ను ఉద్యోగంలోకి తీసుకున్నామని మార్కెటింగ్ మేనేజర్ వాస్సెల్ తెలిపాడు. కాగా, స్విఫ్ట్ తన రెజ్యూమేను కార్లకు అంటిస్తున్న వీడియో ఫుటేజి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో పంచుకున్నది స్విఫ్ట్ కు ఉద్యోగం ఇచ్చిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీయే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles