Budget 2022: Oppn slams it as 'zero-sum budget' కొన్ని వర్గాలను, వేతన జీవులను విస్మరించిన బడ్జెట్: రాహుల్ గాంధీ

Budget 2022 23 is revenge on farmers criminal assault on livelihood of youth opposition

Finance minister Nirmala Sitharaman,union budget 2022,budget india,budget,total budget of 2022,proposed budget 2022,india 2022 budget,healthcare budget,health budget of india 2022,health budget of india,government budget of 2022,government budget for 2022,government budget 2022,general budget 2022,fm nirmala sitharaman,fiscal budget 2022,railway budget in india,central budget 2022

Congress MP Rahul Gandhi termed the Modi government's Union Budget a "zero-sum budget", and said it had nothing for the salaried class, middle class, poor & deprived, youth, farmers and MSMEs. West Bengal Chief Minister and Trinamool Congress Mamata Banerjee came down heavily on the Modi government and said that the Budget 2022-23 has nothing for common people.

రైతులపై ప్రతీకారం.. మధ్యతరగతి, వేతన జీవులను విస్మరించిన బడ్జెట్: రాహుల్ గాంధీ

Posted: 02/01/2022 03:36 PM IST
Budget 2022 23 is revenge on farmers criminal assault on livelihood of youth opposition

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్‌ పై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్ పై స్పందిస్తూ.. కేంద్ర వార్షిక బడ్జెట్ లో రైతు, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలను విస్మరించారని మండిపడ్డారు. మోదీ సర్కారు 'జీరో' సమ్ బడ్జెట్ ప్రకటించిందని అంటూ విమర్శించారు. వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిసిన రైతులపై ప్రతీకారం తీర్చుకుందని అన్నారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొన్ని రంగాలను సంతృప్తి పరచలేకపోయారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజ్ దీప్ సుర్జేవాలా స్పందిస్తూ.. రైతులకు, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదని దుయ్యబట్టారు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తూ పలు ఖర్చులతో సతమతం అవుతున్న వేతన జీవులకు కూడా ఎలాంటి ఊరట కల్పించలేదని మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు కరోనా మహమ్మారి సమయంలో కాస్త ఉపశమనాన్ని ఆశించినా.. వారి ఆశలు అడియాశలయ్యాయని పేర్కోన్నారు. ధరల పెరుగుదల, వేతన కోతల ప్రభావాన్ని వారు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి మరోసారి ప్రత్యక్ష పన్నుల విషయంలో తీవ్ర నిరాశకు గురిచేశారు.

దిశానిర్దేశం లేని బడ్జెట్ అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ విమర్శించారు. రైతులకు, మహిళలకు, యువతకు అందించేవి ఏమీ బడ్జెట్‌లో లేవన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గురించి కూడా ఈ బడ్జెట్ ఏమీ ప్రకటించలేదన్నారు. పేదలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదన్నారు. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ కూడా కేంద్ర బడ్జెట్‌ను విమర్శించారు. పేదలు, యువత, నిరుద్యోగులు లేదా ద్రవ్యోల్బణం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. డిజిటల్ కరెన్సీపై ఎలాంటి చట్టం లేనప్పటికీ ఇప్పుడు దానిపై పన్ను వేస్తున్నారని విమర్శించారు.

సామాన్యులకు రిక్తహస్తం: మమతా బెనర్జీ

కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌పై పలు వర్గాల నుంచి స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బ‌డ్జెట్‌పై చాలామంది విప‌క్ష నాయ‌కులు, ఇత‌ర రాష్ట్రాల నాయ‌కులు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. సామాన్యుల‌కు ఈ బ‌డ్జెట్‌లో గుండు సున్నా చూపించారు. సామాన్య ప్ర‌జ‌లు ఓ వైపు నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్టుగా ప్ర‌భుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చి చివ‌రకు బ‌డ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఇది ఒక పెగాస‌స్ స్పిన్ బ‌డ్జెట్ అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ ట్వీట్ చేశారు.

నిరుత్సాహపర్చింది: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

కేంద్ర బడ్జెట్ అన్ని విధాలా పరిశీలిస్తూ ఇది నిరుత్సాహపర్చే బడ్జెట్ అని వైసీఫీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఎఫ్ఆర్ బీఎం విషయంలో కేంద్రం ద్వంద ప్రమాణాలను పాటిస్తూ. రాష్ట్రాలకు ఒకటి చెబుతు.. తాను మాత్రం మరోకటి అచరిస్తోందని మండిపడ్డారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటేనని.. అయితే తాను ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటరాదంటోందని విమర్శించారు. నదుల అనుసంధాన ప్రణాళికను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజయసాయి విజ్ఞప్తి చేశారు. భూమి లేని రైతులకు ఆసరాగా నిలిచే పథకం తీసుకురావాలని కోరామని, కనీస మద్దతు ధరకు న్యాయపరమైన రక్షణ ఉండాలని తెలిపామని విజయసాయి వివరించారు.

ఆశాజనకంగా లేదు: చంద్రబాబు

కేంద్రబడ్జెట్ నిరాశాజనకంగా వుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ 2022-23పై స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. పేదలు, రైతుల కోసం ఏంచేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని వ్యాఖ్యానించారు. కాగా, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు. డిజిటల్, సోలార్, విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక, బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles