"Merging, Not Extinguishing" Flame At India Gate For Soldiers: Centre అమర్ జవాన్ జ్యోతిని అర్పేడం జాతిద్రోహమన్న కాంగ్రెస్.. ఖండించిన కేంద్రం

Oppn slams centre over decision to extinguish flame of amar jawan jyoti govt alleges misinformation

Amar Jawan Jyoti, Amar Jawan Jyoti flame, Amar Jawan Jyoti extinguished, Amar Jawan Jyoti news, rahul gandhi, shashi tharoor, National War Memorial, National War Memorial flame, indian army martyrs, republic day, india gate, amar jawan jyoti flame, national war memorial, amar jawan jyoti flame merge, indira gandhi, india 73rd republic day, republic day 2022, 73rd republic day

The Opposition strongly hit out at the Centre for its decision to “extinguish” the eternal flame of the Amar Jawan Jyoti as it is to be merged with the National War Memorial on Friday. Congress leader Rahul Gandhi slammed the move, saying “some people cannot understand patriotism”. However, government sources said there was “a lot of misinformation” over the decision.

అమర్ జవాన్ జ్యోతిని అర్పేడం జాతిద్రోహమన్న కాంగ్రెస్.. ఖండించిన కేంద్రం

Posted: 01/21/2022 12:11 PM IST
Oppn slams centre over decision to extinguish flame of amar jawan jyoti govt alleges misinformation

ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఉన్న అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద క‌ల‌ప‌డాన్ని కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. ప్ర‌భుత్వం జాతి ద్రోహానికి పాల్ప‌డుతోంద‌ని కాంగ్రెస్‌ పార్టీ నేత మ‌నీష్ తివారీ తెలిపారు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మార‌కంతో క‌ల‌ప‌డం అంటే.. చ‌రిత్ర‌ను తుడిచిపెట్ట‌డ‌మే అని ఆయ‌న ఆరోపించారు. అమరవీరుల ఆత్మలు ఘోషించే చర్యలకు కేంద్రం పాల్పడటం సరికాదని అన్నారు. జాతీయ యుద్ధ స్మార‌కాన్ని బీజేపీ నిర్మించింద‌ని, అంత మాత్రాన అమ‌ర్ జవాన్ జ్యోతిని ఆర్ప‌డం స‌రికాదు అని తివారీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. కొంద‌రికి దేశ‌భ‌క్తి, త్యాగాలు అర్థంకావ‌ని విమర్శించారు. ఇది చాలా బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని, అమ‌ర జ‌వాన్ల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అహర్నిషలు వెలుగుతున్న జ్యోతిపై కూడా కేంద్రం కన్నుపడిందని.. అందుకని దానిని ఆర్పేస్తున్న‌ట్లు ఆయ‌న ట్వీట్‌లో తెలిపారు. కొంద‌రికి దేశ‌భ‌క్తి, బ‌లిదానం అర్థం కాదు అని, అయినా ప‌ర్వాలేదు అని, మ‌రోసారి మ‌న అమ‌ర సైనికుల కోసం జ్యోతిని వెలిగిద్దామ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా చ‌తుర్వేది త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. రెండు జ్యోతుల‌ను ఎందుకు వెలిగించ‌లేమ‌న్నారు. అమ‌ర జ్యోతిని ఆర్ప‌డం ఇది మంచి రాజ‌కీయాల‌కు సూచ‌కం కాదు అని ఆర్జేడీ నేత మ‌నోజ్ కుమార్ జా ఆరోపించారు.

అయితే అమ‌ర‌వీరుల‌కు నివాళిగా నిలుస్తున్న అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని ఆర్పేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఖండించింది. ఇండియా గేట్ వ‌ద్ద ఉన్న అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద జ్యోతితో ఇవాళ క‌ల‌ప‌నున్న‌ట్లు చెప్పింది. అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని ఆర్ప‌డం లేద‌ని, దాన్ని జాతీయ యుద్ధ స్మార‌కంతో క‌లుపుతున్నామ‌ని, అమ‌ర్ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద కేవ‌లం 1971 యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల పేర్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇత‌ర యుద్ధాల్లో మ‌ర‌ణించిన అమ‌రుల పేర్లు లేవ‌ని కేంద్రం చెప్పింది. మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో మ‌ర‌ణించిన బ్రిటీష్ ఇండియ‌న్ ఆర్మీ అమ‌ర సైనికుల‌కు నివాళిగా బ్రిటీష‌ర్లు ఇండియా గేట్‌ను నిర్మించార‌ని, అది కేవ‌లం బ్రిటీష్ పాల‌న‌కు చిహ్నంగా ఉన్న‌ట్లు కేంద్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

అన్ని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర సైనికుల పేర్ల‌తో పాటు 1971 యుద్ధంలో అమ‌రులైన వారి పేర్ల‌ను జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద చేర్చిన‌ట్లు కేంద్రం తెలిపింది. అందుకే జాతీయ యుద్ధ స్మార‌క‌మే అరుమ‌రుల‌కు అర్పించే నిజ‌మైన శ్ర‌ద్ధాంజ‌లి అని కేంద్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఏడు ద‌శాబ్ధాల నుంచి జాతీయ యుద్ధ స్మార‌కాన్ని నిర్మించ‌లేక‌పోయిన పార్టీలు ఇప్పుడు నిజ‌మైన నివాళి అర్పిస్తుంటే మొస‌లి క‌న్నీరు కారుస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. కాగా, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఇండియ‌న్ ఆర్మీ మాజీ డీజీఎంవో జ‌న‌ర‌ల్ వినోద్ భాటియా స్వాగ‌తించారు. అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మార‌కంతో క‌ల‌ప‌డం గొప్ప నిర్ణ‌య‌మ‌న్నారు. అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మార‌కంతో క‌ల‌పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని జ‌న‌ర‌ల్ వినోద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles