Covid may become endemic by March 11: Top govt scientist కరోనా విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్

Covid may become endemic by march 11 if omicron replaces delta top govt scientist

Covid will become endemic by March 11, ICMR head samiran panda, Omicron deltam Omicron, Delta, Deltacron, reinfections, Covid-19, fully vaccinated, third wave surge,

Head of Indian Council of Medical Research’s Epidemiological Department Samiran Panda has said that Covid will become endemic by March 11. “If we don’t let our guards down and no new variant emerges, Covid will be endemic by March 11,” he said. “If Omicron replaces Delta it will become endemic. If there is no new variant catching up, there is a possibility that Covid may become endemic,” he added.

కరోనా విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ టాప్‌ సైంటిస్ట్‌

Posted: 01/19/2022 01:50 PM IST
Covid may become endemic by march 11 if omicron replaces delta top govt scientist

దేశంలో కరోనా మూడవ దశలో ఏకంగా మూడు లక్షలకు చేరువలో కొత్త  కేసులతో రోగులతో కకావికలం అవుతొంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ కేసులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చెందుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భారీ ఊరట నిచ్చే అంశాన్ని ప్రకటించింది. మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్‌ డి సమీరన్ పాండా వెల్లడించారు.  డెల్టాను ఒమిక్రాన్‌ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చన్నారు. అన్ని జాగ్రత్తలు  తీసుకుంటే.. కొత్త వేరియంట్లేవీ ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ స్థానికంగా సాధారణ ఫ్లూగా మారుతుందని  ఆయన చెప్పారు.

తమ గణాంకాల  ప్రకారం  డిసెంబరు 11 నుండి ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు.   దీని ప్రకారం మార్చి 11 తరువాత నుంచి  కరోనా నుంచి ఉపశమనం లబించవచ్చని పాండా తెలిపారు.  అయితే ఢిల్లీ, ముంబై కోవిడ్ కేసుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయా, ఇంతటితో ఉదృతి ముగిసిందా అని చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో మహమ్మారి వివిధ దశల్లో ఉందనీ, వైరస్‌లోని ఎపిడెమియోలాజికల్ వైవిధ్యాలు, కరోనా రూపాంతరాల నేపథ్యంలో ఐసీఎంఆర్‌ తన టెస్టింగ్‌ వ్యూహాన్ని కూడా మార్చుకుంది, పరీక్షల్ని తగ్గించాలని చెప్పలేదని సమీరన్ పాండా అన్నారు.  

హై రిస్క్‌ కాకపోతే కరోనారోగులు కాంటాక్ట్‌ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవవసరం లేదనే మార్గదర్శకాలిచ్చినట్టు వెల్లడించారు. అలాగే జెనోమిక్ సీక్వెన్సింగ్ గురించి మాట్లాడుతూ, "జెనోమిక్ సీక్వెన్సింగ్ అనేది ఒక డైనమిక్ దృగ్విషయం. ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ల తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే మోల్నుపిరావిర్ ను  ప్రభుత్వ ప్రోటోకాల్‌నుంచి మినహాయించడంపై తమకు, డీసీజీఐ మధ్య డిస్‌కనెక్ట్ ఉందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. వ్యాక్సినేషన్ తీసుకోని రోగులకు మోల్నుపిరావిర్ ఇవ్వవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు,పిల్లలకు దానిని అందించే విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు, అందుకే ఇది ప్రోటోకాల్‌లో లేదని వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh