India records first ‘Omicron death’ దేశంలో ఒమిక్రాన్ కలకలం.. తొలి మరణం నమోదు

First omicron death in india as maharashtra man infected with variant dies

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

Maharashtra on Thursday, 30 December, reported what could possibly be considered as India's first Omicron death. A 52-year-old man with a travel history to Nigeria, who was infected with the COVID-19 variant, died of a heart attack on Tuesday at Pimpri Chinchwad Municipal Corporation's Yashwantrao Chavan Hospital, as per the state's public health department.

దేశంలో ఒమిక్రాన్ కలకలం.. మహారాష్ట్రలో తొలి మరణం నమోదు..

Posted: 12/31/2021 11:25 AM IST
First omicron death in india as maharashtra man infected with variant dies

దేశంలో కరోనా మహమ్మారి మూడవ దశకు ప్రారంభమైందని ఇప్పటికే వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని కూడా ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోల్చితే దాదాపు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇది డెల్టా వేరియంట్ అంత తీవ్ర ప్రభావమైనది కాదని అంచనాకు వచ్చారు. ఈ వేరియంట్ సోకిన వారిలో దాదాపుగా 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ అటు సౌతాఫ్రికా, బ్రిటెన్, అమెరికా, ఇజ్రాయిల్, జర్మనీ సహా పలు దేశాల్లో మరణాలను నమోదుచేసుకుంది.

ఇక తాజాగా ఇటు మన దేశంలోనూ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ను తేలిగ్గా తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అనేక ఆంక్షలతో పాటు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయితే రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షలను తోసిరాజుతూ భారత్ లోని మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ తో తొలి మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర  ప్రభుత్వం నిర్ధారించింది.

కాగా పూణేలోని యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో చేరిన బాధితుడు కరోనా పాజిటివ్ సోకడంతో చికిత్స పొందుతూ ఈనెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, భాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌ గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోవిడ్ మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరణించిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని, నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొంది. ‘బాధితుడు మరణానికి కోవిడ్ కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించింది’ అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్  కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారునున్నారు. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 450కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles