Hidden treasure found in Yadadri Bhuvanagiri యాదాద్రి జిల్లాలో లభ్యమైన నిధి.. తమ్ముడి కిరికిరితో ఠాణాకు..

Hidden treasure with gold and silver coins found in yadadri bhuvanagiri

Hidden treasure unearthed, Kannaboina Mallaiah, agricultural field, Gold ornaments unearthed, Silver ornaments unearthed, mud pot, iron box, Urdu language, Kannaboina Lingaiah, Kukundupamula village, Yadadri police, Yadadri Bhuvanagiri district, Telangana

Gold and silver ornaments were unearthed in Telangana's Yadadri Bhuvanagiri district when the workers were digging an agricultural field. According to the reports, the valuables were found hidden in a mud pot and the incident took place in Kukundupamula village in Yadadri district. It is learned that workers found an iron box and mud pot in the field of Kannaboina Mallaiah.

ITEMVIDEOS: యాదాద్రిలో లభ్యమైన గుప్తనిధి.. తమ్ముడి కిరికిరితో ఠాణాకు..

Posted: 12/30/2021 07:58 PM IST
Hidden treasure with gold and silver coins found in yadadri bhuvanagiri

యదాద్రి భువనగిరి జిల్లాలో ఓ రైతుకు గుప్త నిధి లభించగా, దానిని పోలీసులకు అందించాడు. తన సోదరుడితో ఉన్న విభేదాల కారణంగా దానిని ఆయనతో పంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేయని రైతు నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి వాటిని అప్పగించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు స్థానిక రెవెన్యూఅధికారులకు వాటిని అప్పగించారు. అయితే ఈ నిధులలో బంగారు, వెండి నాణేలతో పాటు బంగారు ఆభరణాలను కూడా ఉన్నాయి. గుప్త నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

యాదాధ్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం కుంకుడుపాముల గ్రామానికి చెందిన రైతు కన్నబోయిన మల్లయ్య పోలంలో పనిచేస్తున్న కొందరు కూలీలు మడిని చదను చేస్తుండగా, ఓ చోట ఇనుప పెట్ట లభించింది. దాని పక్కనే ఓ మట్టి కుండ కూడా లభ్యమైంది. అందులో ఏమున్నాయన్న కూడా తెలియిన కూలీలు రైతు మల్లయ్యకు దానిని అప్పగించారు. దానిని తెరచి చూసిన మల్లయ్య ముఖంలో ఆశ్చర్యం.. ఆ వెంటనే ఆనందం కనిపించాయి. అందులో గుప్తనిధులు లభించాయి. బంగారు, వెండి నాణేలాతో పాటు బంగారు ఆభరణాలు కూడా లభించాయి. రైతు ముఖం కూడా బంగారంలా మెరిసింది. అయితే ఆ మెరుపులు కొద్దిసేపు మాత్రమే నిలిచాయి.

కూలీల ద్వారా విషయం తెలుసుకున్న మల్లయ్య తమ్మడు లింగయ్య.. అన్నకు లభించిన గుప్త నిధులలో వాటా కావాలని కోరాడు. దీంతో ఇద్దరు మధ్య పేచీ పెద్దగానే అయ్యింది. చివరకు ఓ గ్రామ పెద్ద వద్ద పంచాయితీ నిర్వహించి అన్నదమ్ములిద్దరూ దానిని సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. అయితే తమ్ముడితో వాటాను పంచుకోవడం ఇష్టంలేని మల్లయ్య నేరుగా గుప్తనిధిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. వారు రెవెన్యూ అధికారులను సమాచారం అందించగా.. వారు వచ్చి గుప్తనిధిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. నాణేలపై ఉర్దూలో రాసివుందని.. అయితే ఇవి ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు వాటిని పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles