Covid third wave started in Telangana, says health officials సంక్రాంతి నుంచే ధర్డ్ వేవ్.. మాస్క్ మరవద్దు: శ్రీనివాస రావు

Covid 19 third wave has begun says telangana health department and asks people to mask up

Omicron telangana, Telangana omicron third wave, Third wave india, Third wave india omicron, Omicron telangana, G Srinivas rao, Omicron in telangana, covid third wave, Omicron cases, Public Health Director, G Srinivas rao, spike in corona cases, new year, pongal celebrations, covid-19, telangana

Telangana's Health Department said that the Omicron variant of the coronavirus could mark the beginning of the third wave of the pandemic. Director of Public Health and Family Welfare Dr G Srinivasa Rao said that the next two-to-four weeks will be critical for the state and for the entire country due to the spike in cases.

సంక్రాంతి నుంచే ధర్డ్ వేవ్.. కోవిడ్ జాగ్రత్తలు పాటించండీ.. మాస్క్ మరవద్దు: శ్రీనివాస రావు

Posted: 12/30/2021 04:08 PM IST
Covid 19 third wave has begun says telangana health department and asks people to mask up

తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని ఇది రాష్ట్రాలతో పాటు దేశంలోనూ ధర్డ్ వేవ్ రాబోతుందన్న సంకేతాలను ఇస్తుందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్ట‌ర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి క‌రోనాకేసుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని డెల్టా వేరియంట్ తో పోల్చితే ఇది ముఫైరెట్టు అధికంగా విస్తరిస్తుందని అన్నారు. ఈ సూచనలుకరోనా థర్డ్‌ వేవ్‌కు సంకేత‌మ‌ని చెప్పారు. దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజారోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని అన్నారు.

అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించానని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలలో పాల్గోనేవారు తప్పనిసరిగా సాధ్యమైనంత బౌతికదూరాన్ని పాటించాలని సూచించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ను పెట్టుకోవాలని తెలిపారు. ఈ వేడుక నిర్వాహకులు తప్పనిసరిగా ఫూర్తి వాక్సీనేషన్ డోసు తీసుకున్నవారినే అనుమతించాలని కోరారు. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని తెలిపారు. ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాపించిందని ఆయ‌న చెప్పారు. తెలంగాణలో ఆ కేసులు పెరిగాయ‌ని తెలిపారు.

డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని, అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి కానీ, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాధి కన్నా అది సోకిందన్న భయమే మనిషిని విషమ పరిస్థితుల్లోకి నెడుతుందని అన్నారు. దేశంలో తొలి ద‌శ‌, రెండో ద‌శలో క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజ‌లు మాస్క్ ధరించాలని, అంద‌రూ వ్యాక్సిన్‌ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వాటి ద్వారానే ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. వాక్సీన్ తీసుకోనివారు ఇప్పటికైనా టీకాను తీసుకుని ఒమిక్రాన్ తో కూడిన ధర్డ్ వేవ్ నుంచి రక్షణ పోందాలని ఆయన కోరారు.

ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపారు. గతంలో కరోనా రెండు ద‌శ‌ల్లో వ్యాప్తి జ‌రిగిన‌ప్పుడు క‌రోనాపై విజయం సాధించామని చెప్పుకొచ్చారు. మూడో ద‌శ వ్యాప్తి సూచ‌న‌ల నేప‌థ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే, భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, వైరస్ కన్నా భ‌య‌మే ప్రమాదకరమని ఆయ‌న చెప్పారు. అయితే, ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపులాంటిద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles