HIndu seer Kalicharan Maharaj nabbed in MP మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ అరెస్ట్

Hindu seer kalicharan maharaj arrested from madhya pradesh over remarks against mahatma gandhi

Kalicharan Maharaj, Kalicharan Maharaj on gandhi, Kalicharan Maharaj on godse, mahatma gandhi, Raipur police, khajuraho, Guest house, Rahul Gandhi, case against Hindu seer, case against Kalicharan Maharaj, mp news, chhattisgarh news, hindu religious leader, mp news today, madhya pradesh latest news

Chhattisgarh Police arrested Hindu religious leader Kalicharan Maharaj from neighbouring Madhya Pradesh, four days after an FIR was registered against him for allegedly abusing Mahatma Gandhi. He is being brought to Chhattisgarh, where he would be taken to a court, said the police.

మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ అరెస్ట్

Posted: 12/30/2021 03:05 PM IST
Hindu seer kalicharan maharaj arrested from madhya pradesh over remarks against mahatma gandhi

జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేను కీర్తించిన ఆధ్మాత్మిక గురువును పోలీసులు ఎట్టకేలకు కటకటలాపాలు చేశారు. సర్వమతహితం కోరుతూ దేశంలో ఏర్పడిన అప్పటి పరస్థితులను దృష్టిలో పెట్టుకుని హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా నిర్ణయాన్ని బలపర్చిన జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు హిందూ మత నేత కాళీచరణ్‌ మహారాజ్‌.. అదే సమయంలో మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. అవికాస్తా పెనువివాదస్పదంగా మారాయి. దీంతో ఎట్టకేలకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో కాళీచరణ్‌ మహారాజ్ ను రాయ్ పుర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు విచారణ నిమిత్తం ఛత్తీస్ గఢ్ కు తరలించారు. రాయ్ పుర్ లోని రావణ్‌ భాగా మైదానంలో గత ఆదివారం జరిగిన ధర్మ సన్సద్లో కాళీచరణ్‌ ప్రసంగిస్తూ మహాత్మునిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాంధీపై దూషణలకు పాల్పడిన కాళీచరణ్‌.. గాడ్సేను ప్రశంసించడం వివాదానికి దారితీసింది. అంతేగాక, మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా కాళీచరణ్ మహారాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు రాయ్ పుర్ లో ఆయనపై ఓ కాంగ్రెస్‌ నేత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన అరెస్టు తప్పదనుకున్న ఆధ్యాత్మిక గురువు.. ఘటన జరిగిన తర్వాత అదృశ్యమయ్యారు. పోలీసులు ట్రాక్‌ చేస్తారన్న అనుమానంతో ఆయన అనుచరులు కూడా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఆయన గెస్ట్ హౌజ్‌ బుక్‌ చేసుకున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లగా.. కాళీచరణ్‌ కన్పించలేదు. ఎట్టకేలకు ఖజురహోకు సమీపంలోని ఓ హోటల్‌లో ఆయన ఆచూకీ లభించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles