UP perfume trader drove old cars & rode a scooter ‘నోట్ల గుట్టల’ వ్యాపారి.. ఐటీ అధికారులకు చిక్కాడిలా..!

Uttar pradesh kanpur s perfume trader piyush jain drove old cars rode a scooter

Businessman piyush jain arrest, Kanpur IT raid, perfume trader Piyush Jain, toyota qualis, old maruti car, bajaj Priya scooter, piyush jain, businessman, tax raids, Piyush Jain, perfume trader, IT officials, Income Tax Sleuths, Goods and Services Tax (GST), kannauj, gujarat, Kanpur, Uttar Pradesh, Crime

Piyush Jain, the perfume businessman who hoarded Rs 284 crore used to ride scooter and travel in out-dated four-wheelers. Two cars- a Toyota Qualis and a Maruti- were found parked outside his house. According to locals, whenever Piyush Jain visited his ancestral home in Chhipaiti area of Kannauj, he could be seen riding his old Bajaj Priya scooter. He used to lead a very simple life, said locals.

‘నోట్ల గుట్టల’ వ్యాపారి పియూష్ జైన్.. ఐటీ అధికారులకు చిక్కాడిలా..!

Posted: 12/28/2021 03:22 PM IST
Uttar pradesh kanpur s perfume trader piyush jain drove old cars rode a scooter

కాన్పూర్ కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారవేత్త, ‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేతతో ఇంట్లో దాచిన కోట్ల రూపాయల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ఇంట్లో నోట్ల గుట్టలను చూసి అధికారులే నోరెళ్లబెట్టి.. ఏకంగా 120 గంటల పాటు నోట్లను లెక్కించిన విధానంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ అక్రమార్జన సోమ్మును ఒకటి, రెండేళ్లుగా ఆయన ఆర్జించింది మాత్రం కాదు. దాదాపుగా 300 కోట్ల రూపాయలలో ఏకంగా 177 కోట్ల మాత్రం పన్ను ఎగవేత వేసిందేనని స్వతహాగా ఆయన కూడా చివరకు అంగీకరించాడు. అంతకుముందు మాత్రం తమ పూర్వికులకు చెందిన 400 కిలోల బంగారాన్ని అమ్మి ఆర్జించానని చెప్పాడు.

కాగా ఇన్నేళ్లుగా ఆయన అక్రమంగా సంపాదిస్తున్నా.. అధికారులకు ఎందుకు అనుమానం రాలేదు. అసలు ఆయనను తమ నజర్ లో ఎందుకు పెట్టలేదు. అంటే ఆయన ఏ రోజు కూడా హంగులు.. ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులను కూడా వాటికి దూరంగా ఉంచారు. జైన్ ఇంటి ముందు రెండు పాతకార్లు మాత్రమే ఉంటాయి. వాటిల్లో ఒకటి టోయోటా క్వాలిస్ కాగా మరోకటి మారుతి కారు. ఇక ఆయన తన సోంతూరు కననౌజ్ కు వెళ్లినప్పుడు అక్కడ తన పాత బజాజ్ ప్రియా స్కూటర్ పైనే తిరిగేవారని స్థానిక గ్రామస్థులు తెలిపారు. ఇలాంటి ఆయన అక్రమార్జన ఒక్కసారిగా ఎలా బయటపడింది..? ఆయన ఎలా చిక్కారు అన్న వివరాల్లోకి వెళ్తే..  

దొంగ ఎంత తెలివిని ప్రదర్శించినా.. ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడన్నది తెలిసిన విషయమే. అలానే అవసరాన్ని మించిన నకిలీ ఇన్వాయిస్, వే బిల్లులతోనే అడ్డంగా బుక్కయ్యాడు. కొద్దిరోజుల క్రితం జీఎస్‌టీ చెల్లించకుండా సరఫరా చేస్తోన్న, నాలుగు పొగాకు, పాన్‌ మసాలా ట్రక్కులను అధికారులు పట్టుకున్నారు. దర్యప్తులో భాగంగా అధికారులు శిఖర్‌ పాన్‌ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్‌ క్యారియర్‌ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్ వాయిస్ లను అధికారులు గుర్తించారు. దీనిపై శిఖర్‌ పాన్‌ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించాగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు.

అయితే శిఖర్‌ పాన్‌ మసాలాలో ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు ఉన్నట్లుగా కూడా గుర్తించిన అధికారులు.. నకలీ ఇన్వాయిస్ లు, ఈ-వే బిల్లుల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రెండు కంపెనీలపై దాడులు నిర్వహించారు. ఓడోకామ్‌ రిజిస్ట్రర్డ్‌ అడ్రస్‌ ఉన్న కంపెనీ యజమాని అయిన పీయూష్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఒడోకామ్ కంపెనీకి యజమాని అయిన పియూష్ జైన్ ఇంటిపై దాడుల్లో ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బు లభించింది. రూ.280 కోట్ల నోట్ల కట్టు రెండు బీరువాల్లో లభ్యంకాగా, వాటిలో ఏకంగా రూ.177 కోట్లు పన్నుఎగవేసి కూడబెట్టినవే. నలుగురు బ్యాంకు అధికారులు ఏకంగా 120 గంటల పాటు వీటిని లెక్కించడానికి శ్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles