ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పైస్ జెట్ "వావ్ వింటర్ సేల్" పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నడుస్తున్న క్రమంలో టికెట్లు బుక్ చేసుకన్నవారికి మరో రెండు ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచిత ఫ్లయిట్ ఓచర్ తో పాటుగా ఆడ్ అన్ ఆపర్ ను కూడా స్పైస్ జెట్ సంస్థ తమ కస్టమర్లకు అందించనుంది.
‘వావ్ వింటర్ సేల్' ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు అన్ని ధరలు కలుపుకుని కేవలం రూ. 1122కే గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే ఇందుకుగాను కేవలం నాలుగు మార్గాలను మాత్రమే ఎంపిక చేసిన సంస్థ.. వీటిలో ప్రయాణించే కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందించనుంది. ఆ నాలుగు మార్గాలు చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ- శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 ధరకు వన్ వే ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది.
ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణీకులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పు వస్తే ప్రయాణ తేదీకి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని కూడా మార్చుకోవచ్చు. అలాగే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 - ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక ఉచిత ఫైయిట్ ఓచర్ కింద కస్టమర్ల తదుపరి విమాన ప్రయాణంలో తమ విమాన బేస్ ధరలో రూ.500 తగ్గింపును అందజేయనుంది. ఈ వోచర్ తో ఫిబ్రవరి 1 నుచి 30 సెప్టెంబర్ వరకు ప్రయాణం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు అడ్ ఆన్ కింద కూడా అందిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more