UP perfume trader arrested; cash worth Rs 257 cr siezed ‘నోట్ల గుట్టల’ వ్యాపారి అరెస్ట్.. రూ.257 కోట్ల నగదు సీజ్..

Cbi unearths rs 257 cr cash from businessman dubai property documents seized

businessman, tax raids, Piyush Jain, Businessman piyush jain arrest, Kanpur IT raid, perfume trader Piyush Jain, perfume trader, IT officials, Income Tax Sleuths, Goods and Services Tax (GST), Kanpur, Uttar Pradesh, Crime

Documents pertaining to 16 expensive properties were found during the raid at Kanpur perfume trader Piyush Jain’s house. Four of these properties are in Kanpur, 7 in Kanauj, 2 in Mumbai, and 1 is in Delhi. Two properties have been traced in Dubai. In addition to the cash and property papers, several kilograms of gold was also seized from Piyush Jain’s house.

‘నోట్ల గుట్టల’ వ్యాపారి అరెస్ట్.. 120 గంటల సోదాలు.. రూ.257 కోట్ల నగదు సీజ్..

Posted: 12/27/2021 04:45 PM IST
Cbi unearths rs 257 cr cash from businessman dubai property documents seized

 ఎన్నికల వేళ.. రాజకీయనాయకులకు అత్యంత సన్నిహితులైన వారిళ్లపై దాడులు జరగడం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పరిపాటిగా మారింది. అక్రమ డబ్బును స్వాథీనం చేసుకోవడం.. అక్రమ మార్గాల ద్వారా డబ్బును కూడబెట్టిన వారిని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం.. వారి నుంచి అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడం షరామామూలుగా మారింది. ఓ విధంగా ఇలా నల్లడబ్బు పట్టబడటం ఉత్తమమైనదే అయినా.. కేవలం ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లలో మాత్రమే డబ్బులు, ఆస్తుల పత్రాలు పట్టుబటం.. బీజేపి దాని మిత్రపక్షాల నేతలకు మాత్రం మినహాయింపు లభించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ పర్ వ్యూమ్ ట్రేడర్ అయిన పియూష్ జైన్ అనే వ్యాపారవేత్త ఇంటిపై దాడి చేసిన అధికారులు ఏకంగా 120 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి నుంచి ఏకంగా 257 కోట్ల రూపాయల నగదుతో పాటు దుబాయ్ లోని ఖరీదైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. దీంతో పాటు బంగారు, వెండి ఆబరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పియూష్ జైన్ భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత, అఖిలేష్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై గత గురువారం రోజుల ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇంట్లోని రెండు అల్మారాలో నీట్ గా టేప్ చుట్టి నోట్ల గుట్టలు కనిపించడంతో.. ఐటీ అధికారులు జీఎస్టీ అధికారులను అలర్ట్ చేశారు. ధీంతో ఇరు విభాగాలకు చెందిన అధికారులు ఈ దాడులను నిర్వరామంగా 120 గంటల పాటు నిర్వహించారు. అక్రమ డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు ఖరీదైన పత్రాలను సీజ్ చేశారు. కాన్పూర్ లోని 4, కన్నౌజ్లో 7, ముంబైలో 2, ఢిల్లీలో ఒక్క ఆస్తికి సంబంధించిన పత్రాలతో పాటు దుబాయ్ లోని రెండు ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పీయూష్‌ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడి.. ఈ మొత్తాన్ని కూడబెట్టినట్లు గుర్తించారు. సుమారుగా రూ. 1000కోట్ల వరకు ఈ సుగంధ ద్రవ్య వ్యాపారి పన్ను ఎగవేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పీయూష్‌ జైన్‌ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన సమాజ్ వాదీ పార్టీ పేరుతో ఓ సమాజ్ వాది సెంటును కూడా విడుదల చేశారు. ఈ సెంటును తన కంపెనీలోనే తయరూ చేయించిన ఆయన దానిని అఖిలేష్ సమక్షంలోనే మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయనను టార్గెట్ చేశారన్న విమర్శలు కూడా వున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీపై అధికార బీజేపి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles