Revanth Reddy in police custody Ahead Of Rachabanda At Erravalli ఎర్రవల్లిలో కాంగ్రెస్ రచ్చబండ.. పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి

Police takes tpcc president revanth reddy into custody ahead of congress rachabanda at erravalli

Revanth Reddy, High Tension at Jubilee Hills residence, Revanth Reddy House, Revanth Reddy Arrest, Gajwel constituency, Erravalli farm House, TPCC, Congress, TPCC President Revanth Reddy, Erravalli RachaBanda, CM KCR farm House, paddy procurement, Telangana congress, CM Farm House paddy, TRS, Telangana rice procurement, Telangana Rashtra Samithi, Central government orders on paddy, Telangana Politics

Telangana Pradesh congress committee President Revanth Reddy had been detained by Hyderabad Police. On Monday morning, Revanth was going to depart towards Erravalli in Gajwel constituency to participate in the 'Rachabanda' programme. High tension reigned outside Revanth Reddy's Jubilee Hills residence as his followers attempted to protest the leader's arrest.

ITEMVIDEOS: ఎర్రవల్లిలో కాంగ్రెస్ రచ్చబండ.. పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి

Posted: 12/27/2021 05:31 PM IST
Police takes tpcc president revanth reddy into custody ahead of congress rachabanda at erravalli

 రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి రైతులకు ఓ విధంగా చెబుతూ.. వారు మాత్రం మరో విధమైన విధానాన్ని అవలంభిస్తున్నారని అరోపించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. యాసంగిలో వడ్డు పండించవద్దు అని చెప్పి.. ఇలా పండించిన వడ్లను తాము కొనబోమని.. వరి వేస్తే ఉరే అని రైతులకు చెప్పిన ప్రభుత్వం.. రైతులను ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని అదేశించింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌజ్ లో 150 ఏకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని అరోపించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నెలకొన్న ఎర్రవల్లిలో ఇవాళ రచ్చబండ నిర్వహిస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇవాళ రెండు గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధర్యంలో రచ్చబండ నిర్వహణకు ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. అయితే రేవంత్ ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఈ మేరకు ఆయన గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. ఈ పరిస్థితిని అంచనావేసిన ఆయన.. వెంటనే తన ఇంటికి చేరుకునే అన్ని దారుల్లో పోలీసులు మోహరించిన తీరును వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. దీంతో ఆయన నివాసానికి పెద్దఎతున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దేనికి భయపడుతోంది..? ఎందుకు భయపడుతోంది.? అని ప్రశ్నించారు. తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లును కూడా రేవంత్ వీడియోలో షూట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల బందోబస్తు మధ్య ఆయన ఎర్రవల్లి వెళ్తేందుకు సమాయత్తమై ఇంటిని నుంచి బయటకు రాగానే రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్ యతీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో తాడు సాయంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపు చేసి.. మరోవైపు ఓ పోలీసు రేవంత్ ను చేరుకుని ఆయనను ఎత్తుకుని పోలీసు జీవులోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసుల సమూహం మధ్య తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles