First Omicron death reported in Israel ఇజ్రాయిల్ లోనూ నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..

Omicron israel reports its first death from covid 19 variant

coronavirus news, Omicron, omicron cases in india, Omicron Death, Omicron Case Tally, Omicron Variant Alerts, Omicron Death in Israel, Israel First Omicron Death, Omicron Case, Omicron Cases in Israel, 60 years old man, pre-existing health issues, Soroka Hospital, Beersheba, Israel

Israeli health officials reported that the country has registered what is believed to be the country's first death from the omicron variant of the coronavirus. Soroka Hospital, located in the southern city of Beersheba, said a man in his 60s died, two weeks after he was hospitalised. It said the man had suffered from pre-existing health issues but gave no further details.

అమెరికా తరువాత ఇజ్రాయిల్ లో నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..

Posted: 12/22/2021 11:04 AM IST
Omicron israel reports its first death from covid 19 variant

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ముప్పు పెరుగుతున్నది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. డెల్టా వేరియంట్ తో పోల్చితే దీని ప్రభావంత తక్కువని ఇప్పటికే వైద్య నిఫుణులు చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది కూడా ప్రమాదకారి అన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ లో ఏకంగా 15 మందిని పోట్టన పెట్టుకున్న ఒమిక్రాన్ అటు, అమెరికాలో మరణాన్ని నమోదు చేసుకుంది. ఇక తాజాగా ఇజ్రాయెల్‌లో ఒమిక్రాన్‌ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని దేశవైద్యవిభాగం అధికారులు ధ్రువీకరించారు.

దక్షిణ నగరమైన బీర్షెబాలోని సోరోకా ఆసుపత్రిలో ఒమిక్రాన్ సోకిన 60 సంవత్సరాల వ్యక్తి రెండు వారాల క్రితం చికిత్స నిమిత్తం చేరారని అసుపత్రి వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తి సోమవారం మరణించాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఇంతకు ముందు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడ్డాడని తెలిపారు. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదివరకే రెండు డోసుల కరోనా వాక్సీన్ తో పాటు మహమ్మారి దరిచేరకుండా బూస్టర్ డోస్ కూడా అందించిన ఇజ్రాయిల్.. ఇక 60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో ఏదో ఒక అరోగ్య సమస్య తలెత్తిన నేపథ్యంలో వారికి మరో బూస్టర్ డోస్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

ఈ మేరకు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నట్ అరోగ్యశాఖ అధికారులకు అదేశాలను అందించారు. ఆవరమై ఏళ్లకు పైబడిన వారితో పాటు అరోగ్యపరంగా తీవ్ర సమస్యలను ఎదుర్కోంటున్నవారితో పాటు ఇమ్యూనిటీ తక్కువగా వున్నవారికి నాల్గవ డోస్ కరోనా వాక్సీన్ ను అందించాలని అదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసింది. ఆ తర్వాత బూస్టర్‌ డోస్‌ సైతం అందించిన దేశంగా నిలిచింది. 9.3 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో కొవిడ్‌ కారణంగా 8,200 మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles