Free carry bags- D mart, orders Consumer Court డీమార్ట్ కు వినియోగదారుల కోర్టు జరిమానా.!

D mart penalised for charging carry bags regardless of printed logo

DMart, carry bag, Consumer Court, Hyderabad District, consumer commission, Customer, Service, March, Akash Kumar, Tarnaka, Medchal, district consumer commission, DMart Penalised, compensation

The carry bag problem is small .. but .. the number of users facing that problem is high. The hyderabad D'mart branch has been directed to refund Rs 3.50 charged for handbags at customers and pay Rs 1,000 as compensation and Rs 1,000 to the legal services centre. It says to give away free carry bags to customers, regardless of the printed logo.

రీటైల్ దిగ్గజ సంస్థ డీమార్ట్ కు వినియోగదారుల కోర్టు జరిమానా.!

Posted: 12/21/2021 07:16 PM IST
D mart penalised for charging carry bags regardless of printed logo

క్యారీ బ్యాగ్ సమస్య చిన్నదే.. కానీ.. ఆ సమస్యను ఎదుర్కొనే వినియోగదారుల సంఖ్య మాత్రం ఎక్కువ. నాలుగైదు వేల రూపాయలు పెట్టి.. కావాల్సిన ఇంటి సరకులు కొంటాం. కానీ క్యారీ బ్యాగ్ ఉచితంగా ఇస్తారేమోననుకుంటే.. దానికి డబ్బులు వసూలు చేస్తారు. సరే తక్కువే కావచ్చు.. కానీ అన్ని సరకులు కొన్నప్పుడు ఉచితంగా ఇస్తే ఏం పోయింది అనుకుంటాం కదా. మరోవైపు డబ్బులకు ఇచ్చే క్యారీ బ్యాగ్ పైనా.. కంపెనీకి చెందిన లోగో కూడా ఉంటుంది. అంటే.. వినియోగదారుడు ఓ వైపు కంపెనీకి సంబంధించి.. ప్రమోషన్ కూడా చేస్తున్నాడు. అలాంటప్పుడు ఫ్రీగా ఇవ్వాలి కదా.

కొన్ని రిటైల్ సంస్థలు క్యారీ బ్యాగ్స్ కోసం.. రూ.3 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తు్న్నాయి. తమ సంస్థ పేర్లను ముద్రించి వినియోగదారుడిని ప్రచార ఏజెంటుగా ఉపయోగించుకుంటున్నాయి.ఈ విషయంపైనే.. హైదరాబాద్​లోని తార్నాకకు చెందిన ఆకాశ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఆకాశ్.. 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో సరకులు కొన్నాడు. బిల్లు రూ.602.70 అయ్యింది. డీ మార్డ్ వాళ్లను..  క్యారీ బ్యాగ్ అడగగా.. రూ.3.50 వసూలు తీసుకుని ఇచ్చారు. సంస్థ పేరు ముద్రించినా.. ఛార్జీ వసూలు చేయడంపై ఆకాశ్.. హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించాడు.

ఫిర్యాదుదారుడివి నిరాధార ఆరోపణలని డీ మార్డ్ సంస్థ రాతపూర్వక తెలిపింది. బ్రాండ్‌ పేరుతో ఉన్నవి, లేని బ్యాగులు ఉన్నాయని పేర్కొంది. వాటిని తీసుకెళ్లలా..లేదా అనేది కస్టమర్ ఇష్టమని చెప్పింది. దీనిపై స్పందించిన వినియోగదారుల కమిషన్.. మీ వాదనలకు, వాస్తవానికి పొంతన లేదని చెప్పింది. వినియోగదారులు తీసుకొచ్చే.. క్యారీ బ్యాగ్ ని ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ పెట్టి వెళ్లాలని చెప్పడం కరక్టెనా అని  ప్రశ్నించింది.

అయితే.. ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2011 ప్రకారం చేతి సంచులు ఉచితంగా ఇవ్వకూడదు. కానీ.. 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ చెప్పింది. ఎప్పటివో పాత నిబంధనలు చూపుతూ.. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయోద్దని వ్యాఖ్యానించింది. వినియోగదారులను దోచుకోవడమేనని స్పష్టం చేసింది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని చెప్పింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది. ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే క్యారీబ్యాగ్స్‌ ఇవ్వాలంటూ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles