Buffalo Saves Tortoise By Flipping it Over తలకిందలుగా పడిన తాబేలును రక్షించిన గేదె..

Viral video buffalo saves tortoise by flipping it over in heartwarming viral video

Buffalo saves tortoise by flipping it over, Buffalo saves turtle by flipping it over, buffalo saves tortoise, buffalo saves turtle, buffalo saves stuck tortoise, buffalo save baby from lions, buffalo saved from lions, buffalo saves, buffalo saves friend from lion, buffalo saves calf from lions, buffalo save tortoise, buffalo save baby elephant from lions, turtle saved by buffalo, tortoise saved by buffalo, trending video, Viral video, video viral

Animal videos on the internet are sometimes just too good to miss out on and we have one that will definitely put a smile on your face. A video of a buffalo saving a tortoise has surfaced online. The way the buffalo helped out the turtle will surely warm your hearts.

ITEMVIDEOS: వైరల్ వీడియో: తలకిందలుగా పడిన తాబేలును రక్షించిన గేదె..

Posted: 12/20/2021 06:45 PM IST
Viral video buffalo saves tortoise by flipping it over in heartwarming viral video

కోపం వచ్చిన ప్రతీసారి ఏరా కోతిలా చేయకు.. గేదెలా నమలకు.. పందిలా పడుకోకు.. ఇలా పెద్దలు పిల్లలను తిట్టడం తెలిసిందే. అయితే వారికి నిజంగా వాటి గురించి తెలిసే అంటున్నారు కాబోలు అనుకుంటాం. కానీ వాటి గురించి మనుషులకు తెలిసిందే చాలా తక్కువే అని.. ప్రాణికి అపకారం తలపెడితే.. మరో ప్రాణి ఎలా కాపాడుతుందో ఇటీవల ఓ వీడియోలో చూశాం. ఓ వ్యక్తి కుక్కలను చిత్రహింసకు గురిచేస్తుంటే.. అటుగా వచ్చిన సాధుజంతువైన ఆవు.. ఆ వ్యక్తిపై విరుచుకుపడి ఎత్తికుదేయడం చూశాం. అయితే స్వతహాగా అపదలో వున్న మరో ప్రాణిని పశవులు ఎలా కాపాడుతాయో తెలుసా.?

అంటే చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న సింహం-ఎలుక, పావురం-చీమ, ఇలాంటి కథలు నిజమేనా.? అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా.? వాటి గురించి తెలియదు కానీ.. ఏదైనా ప్రాణి అపదలో ఉంటే మాత్రం మరో ప్రాణి కచ్చితంగా సాయం చేస్తుందని మాత్రం ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇంత చేసినా.. నీకు నేను సాయం చేశాను.. నాకు ఫలానా ఇవ్వు అని సాయం చేసిన ప్రాణి కోరదు. సరికదా కనీసం ప్రత్యోపకారం కూడా ఆశించకుండా కేవలం సాయం చేయడం నా ధర్మం అనుకుని చేసి వెళ్లిపోతుంటాయి. దీంతో జీవిత పరమార్థం అంటే ఏంటో పశువులకు తెలిసినంతగా మనుషులకు తెలియదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.  

ఇక్కడ ఈ కింద వీడియోలో ఓ గేద అటుగా వస్తోంది. దాన్ని తలకిందులుగా చూసిన తాబేలుకు పైప్రాణాలు పైనే పోయాయి. అయ్యో దీనికి కిందకు చూసి నడిచే అలావాటు లేదే. నన్ను గానీ ఇది తొక్కేస్తే.. నా పరిస్థితి ఏమిటీ.? అని భయాందోళన చెందింది. తీరా చూస్తే.. గేద కిందకు చూడగానే ఓ తాబేలు కనిపించింది. అయితే అది కదల్లేని స్థితిలో తిరబడి వుంది. దీంతో గేద.. దానిని కాపాడాలని భావించింది. వెంటనే తన కొమ్ములను నెలకు రాసుకుంటూ వెళ్లింది. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో మరోమారు ముందరి కాళ్లను వంచి మోకాళ్లపై కూర్చోని కొమ్ములతో తాబేలును నడిచే స్థితికి తీసుకువచ్చింది.

దీంతో అటు తాబేలు ఖుష్.. ఇటు గేద కూడా సాయం చేసానని సంతోషం. ఈ ఘటనను స్థానికులు కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. తొలుత గేద ఎందుకు కొమ్ములను కిందకు రాస్తుందని.. చూశామని.. దీంతో తమ కెమెరాను జూమ్ చేసి పరిశీలించి చూడగా.. అది కాస్తా అక్కడి నేలపై తిరగబడిని తాబేలును యథాస్థానానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలుసుకున్నామని.. దాని ప్రయత్నం విఫలం కావడంతో.. మరోసారి ప్రయత్నించిందని.. రెండో ప్రయత్నంలో అది తన సాయం చేయగలిగిందని చెప్పిందని అన్నారు. దీంతో తాము సంతోషించి గేదకు ధన్యవాదాలను తమ కరతాళధ్వనుల ద్వారా తెలియజేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Buffalo Saves Tortoise  Tortoise  Turtle  Buffalo  Animals  Viral Video  

Other Articles