Defiant Shilpa accuses cops of harassment శిల్పాచౌదరి పోలీస్ కస్టడీ ముగింపు.. ఆ ముగ్గురికి డబ్బు తిరిగిస్తానని వేడుకోలు.!

Tollywood producer shilpa chowdary agrees to repay amount to all the three complainants

page3 party, Shilpa arrested, producer Shilpa, Shipa chowdary, Tollywood hero Harsh, harsh kanumilli, saheri hero, film personalities, filmmakers, realtors, investments, high returns, cheating, Fraud, black money, high profile people, Narsingi police, Hyderabad, crime

Telugu Cinema Producer and socialite Shilpa Chowdary had agreed to repay for an amount of Rs 7 crores to all the three complainants including Priyadarshini and Young Hero Harsh Kanumulli during her three day police Custody.

శిల్పాచౌదరి పోలీస్ కస్టడీ ముగింపు.. ఆ ముగ్గురికి డబ్బు తిరిగిస్తానని వేడుకోలు.!

Posted: 12/13/2021 12:03 PM IST
Tollywood producer shilpa chowdary agrees to repay amount to all the three complainants

టాలీవుడ్ హీరోల‌తో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. రూ.కోట్ల మేర డబ్బును వసూలు చేసిన కిలాడీ లేడి శిల్పా చౌద‌రీ అవినీతి విన్యాసాల జాబితాలో చిక్కున్న అనేక మంది ఇప్పటికీ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకు కారణంగా అమె వారి నుంచి వసూలు చేసిన మొత్తం బ్లాక్ మనీ కావడమేనని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అమెపై ముగ్గురు అధికారికంగా నార్సింగి పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని.. సహా టాలీవుడ్ యంగ్ హీరో హర్ష్ కూడా నిట్టనిలువునా మోసపోయాడు.

శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి ప్రియదర్శిని రూ.2 కోట్లను అమెకు ఇవ్వగా.. యంగ్ హీరో హర్ష్ కనుమల్లి ఏకంగా రూ. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు శిల్పా చౌదరిపై తొలిసారిగా పిర్యాదు చేసిన దివ్యారెడ్డి, రేణుకారెడ్డీలకు కూడా కోట్ల రూపాయల మేర శఠగోపం పెట్టిన విషయం తెలిసింది. అయితే వీరి పిర్యాదుల ఆదారంగా అమెను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. దీంతో పోలీసుల విచారణలో అమె తనపై పోలీసులకు పిర్యాదు చేసిన ముగ్గురికి వారి డబ్బును తిరిగి చెల్లిస్తానని అంగీకరించినట్లు సమాచారం.  

కాగా, రాధికారెడ్డికి తాను రూ.10 కోట్లకు పైగానే ఇచ్చినట్టు శిల్పాచౌదరి చెప్పినప్పటికీ అందుకు తగిన ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అమె చేసిన మోసాలపై పోలీసులు మరిన్నీ వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరి గతంలో అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఖాతాలో రూ. 16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా, మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

సుమారు 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. వారి నుంచి ప్రముఖులను పరిచయాలు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూళ్లు చేసింది. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసిన‌ట్లు వార్త‌లు అందిన విషయం తెలిసిందే. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. ల్ల‌ధ‌నాన్ని మార్పిస్తాన‌ని, అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి శిల్పి.. ప్ర‌ముఖుల్ని మోసం చేసింది. మోస‌పోయిన‌వారిలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles