Omicron could lead to 75,000 deaths in UK: study ఒమిక్రాన్ తో భారీ ప్రాణనష్ట అంచనా.. బ్రిటెన్ కీలక నిర్ణయం

Omicron may cause up to 75 000 deaths in uk by april end study

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron, covid, delta variant, omicron symptoms, what are the symptoms of omicron, what are the symptoms of omicron virus, COVID booster dose Britain, booster dose above 30 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

UK scientists have warned that the number of deaths from the Omicron variant by the end of April could range from 25,000 to 75,000 depending on how well vaccines perform in the country. But the experts behind the study said there was still uncertainty around the modelling.

ఒమిక్రాన్ తో భారీ ప్రాణనష్ట అంచనా.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్

Posted: 12/13/2021 11:02 AM IST
Omicron may cause up to 75 000 deaths in uk by april end study

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 78 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. మరీముఖ్యంగా యూరోప్ దేశాలలో ఇప్పటికే తన ప్రబావాన్ని చాటుతొంది. శరవేగంగా వ్యాప్తి చెందుతూ రోజూ వందలాధి మందిని ప్రభావితం చేస్తోంది. దేశంలో ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరగకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల మంది ఈ వేరియంట్ బారినపడి మరణించే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా 60 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్, దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ యూనివర్సింటీ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ నిర్ణయానికి వచ్చారు. ఒమిక్రాన్ అణచివేతకు ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోకపోతే గతేడాది ఆల్ఫా వేరియంట్ విరుచుకుపడినప్పుడు తలెత్తిన కేసుల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీని వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, రోగ నిరోధకశక్తి ఉన్నవారు సులభంగా దీని బారినపడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇంగ్లండ్‌లో ఒక్కరోజే దాదాపు 600 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీని ఉద్ధృతి ఇలాగే కనుక కొనసాగితే ఈ నెలాఖరు నాటికే వీటి సంఖ్య 10 లక్షలు దాటిపోవచ్చని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ఇటీవల పేర్కొనడం ఒమిక్రాన్ సంక్రమణ తీవ్రతకు అద్దం పడుతోంది.  ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బూస్టర్ డోస్ కు సంబంధించి ఈరోజు నుంచి బుకింగులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులను అక్కడి ప్రభుత్వం ఇచ్చింది.

మరోవైపు బూస్టర్ డోసుల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని... ప్రతి ఒక్కరు కచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. ఇదిలావుంచితే, మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్లు మన దేశంలో కూడా వినిపిస్తున్నాయి. బూస్టర్ డోసులను పంపిణీ చేయాలని ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. అయితే బూస్టర్ డోస్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Omicron  Variant  Covid  WHO  covaxin  phfi  covishield  coronavaccine booster dose  above 30 years  omicron symptoms  

Other Articles