TRS boycotts remaining Parliament winter session పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్.. కారణాలివే..

Trs boycotts rest of parliament winter session over centre s stand on rice procurement

TRS, Telangana rice procurement, Telangana Rashtra Samithi, Parliament, winter session, Rajya Sabha, Lok Sabha, black shirts Protest, boycott Parliament session, K Keshava Rao, Nama Nageshwar Rao, Central Government, Telangana Politics

TRS MPs have decided to boycott the rest of the winter session of Parliament, protesting against the central government's alleged indifferent attitude on rice procurement from Telangana. The TRS members attended the Rajya Sabha and Lok Sabha wearing black shirts. However, both the Houses did not take up the short discussion as requested by them on paddy procurement.

పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్.. కారణాలివే..

Posted: 12/07/2021 01:33 PM IST
Trs boycotts rest of parliament winter session over centre s stand on rice procurement

పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో వరి అంశాన్ని ఎత్తుకుని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాని నిలదీయాలని భావించిన టీఆర్ఎస్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. వాడీవేడిగా కొనసాగుతున్న శీతాకాల సమావేశాల మిగిలిన సెషన్ ను తాము బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా. ప్రభుత్వం పట్టించుకోవాడం లేదని.. తాము తెలుపుతున్న నిరసనలు, తమ ప్రాంత రైతుల కష్టాలు కేంద్రానికి పట్టనట్టు వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు అవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ, చట్టసభలను బాయ్ కాట్ చేయడం బాధాకరమైన విషయమేనని... అయితే, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బాయ్ కాట్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. 9 మంది లోక్ సభ, 7 గురు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై గత ఏడు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని... కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెపుతోందని... రబీ సీజన్ లో ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుందని, అందుకే రబీలో పండే ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా మారుస్తామని కేకే చెప్పారు. బాయిల్డ్ రైస్ ను కొంటారో, లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడం లేదని... డొంక తిరుగుడు సమాధానాలను చెపుతోందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగడం లేదనే కారణంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించకుండా బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles