A North Carolina man won 2 jackpots అదృష్టవంతుడంటే ఇతనే.. ఒకే రోజు రెండు జాక్ పాట్ లాటరీలు..

A north carolina man accidentally bought 2 identical lottery tickets and won 2 jackpots

Lottery, Betting, North Carolina, Scotty Thomas, Jackpot, Luck, Life drawing, basketball game, second-biggest prize, America

A man has won big after accidentally purchasing two identical tickets for the same lottery drawing and ending up winning two prizes of $25,000 a year for life. Scotty Thomas, from North Carolina, said the mistake came about after he was thinking about the upcoming Lucky for Life drawing and couldn’t remember if he’d already bought a ticket.

అదృష్టవంతుడంటే ఇతనే.. ఒకే రోజు రెండు జాక్ పాట్ లాటరీలు..

Posted: 12/06/2021 07:55 PM IST
A north carolina man accidentally bought 2 identical lottery tickets and won 2 jackpots

అధృష్టం అంటూ ఉండాలే కానీ.. ఒక్క దెబ్బతో మారుమూల బెగ్గర్ కూడా బర్గర్ తినే కంట్రీలో చక్రం తిప్పుతాడు. అది అదృష్టానికి వుండే బలం. అలాంటి అదృష్టం వున్న ఓ వ్యక్తికి అదృష్టం ఎంతలా వుందంటే తాను అనుకోకుండా కొన్న రెండు ఒకేలా వుంటే రెండు విభిన్న లాటరీ టికెట్లలో రెండు జాక్ పాట్ లు తగిలాయి. అంటే ఇతడి విషయంలో  డబుల్ ధమాకా అదృష్టమనే చెప్పాలి. ఒక లాటరీ తగలడమే గొప్ప అదృష్టం అనుకుంటే, ఈ అదృష్టవంతుడికి డబుల్ ధమాకా తగిలింది. తాను ఇన్నాళ్లు పడ్డ కష్టానంతా దూరం చేసింది.

తనకు రెండు జాక్ పాట్లు వచ్చిన విషయాన్ని నమ్మలేకపోయిన ఈ అదృష్టవంతుడు ఏకంగా కిందపడి బోర్తి.. తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ కరోలినాకు చెందిన 49 ఏళ్ల స్కాటీ థామస్ రెండు లాటరీ టికెట్లు కొంటే రెండింటికి జాక్ పాట్ తగిలింది. ఆ రెండు లాటరీ టికెట్లు కొనడం వెనుక కూడా ఎంతో ఆశ్చర్యకరమైన కథ ఉంది. స్కాటీ థామస్ ఓ డంపింగ్ ట్రక్కు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఇంట్లో బెడ్ పై పడుకుని టీవీలో బాస్కెట్ బాల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సందర్భంగా మొదట ఆన్ లైన్ లో ఒక టికెట్ కొనుగోలు చేశాడు.

అయితే, ఆ టికెట్ కు సంబంధించి ఆన్ లైన్ లో అన్ని వివరాలు పొందుపరిచానో లేదో అనే సందేహం కలిగింది. దాంతో ఆన్ లైన్ లో తన వివరాలతో మరో ఫారం నింపాడు. కనీసం ఒక్కదాంట్లో అయినా తన అదృష్టం మారుతుంది కదా అన్న ఆశతోనే ఆయన రెండు టికెట్లు కొన్నట్టయింది. అయితే యాథృఛికంగా ఆయన చేసిన పనికి ఎక్కువ డబ్బలు కూడా చెల్లించాడు. ఏదోలే ఇలా జరిగిపోయింది అని అనుకున్న తరుణంలో.. అతడికి మహా అదృష్టం పట్టిందన్న విషయం డ్రా తీయడంతో తెలిసింది. తాను కొనుగోలు చేసిన రెండు టికెట్లకు లైఫ్ టైమ్ జాక్ పాట్ ప్రైజు వచ్చింది. దాని ప్రకారం ప్రతి టికెట్ మీద ప్రతి ఏడాదికి 25 వేల డాలర్లు లభిస్తాయి.

ఆ విధంగా రెండు టికెట్ల మీద జీవితాంతం ప్రతి ఏడాది 50 వేల డాలర్లు స్కాటీ థామస్ సొంతం అవుతాయి. కాగా, ఇంతటి బంపర్ ప్రైజు తనకు లభించిందన్న వార్త వినగానే నమ్మలేకపోయానని, ఆనందంతో కిందపడి దొర్లానని థామస్ వెల్లడించాడు. అయితే, జీవితాంతం డబ్బు తీసుకునే బదులు ఒకేసారి 7,80,000 డాలర్లు కోరుకున్నాడు. సదరు లాటరీలో ఈ విధమైన సదుపాయం కూడా ఉంది. వ్యాపారం చేయడానికి, కుటుంబ అప్పులు తీర్చడానికి, ఓ ఇల్లు కొనడానికి ఆ సొమ్ము ఖర్చు చేస్తానని వెల్లడించాడు. కాగా పన్నులన్నీ మినహాయించుకుంటే అతడికి 5,51,851 డాలర్లు లభిస్తాయని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles