Covaxin more effective against Omicron ఒమిక్రాన్ లక్షణాలు తీవ్రత ఇలా.. కోవాగ్జిన్ ప్రభావంతం.!

South african doctor who detected omicron strain lists symptoms

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron india, omicron,covid,delta variant,angelique coetzee,omicron symptoms,what are the symptoms of omicron,what are the symptoms of omicron virus, COVID booster dose in india, booster dose above 40 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

The chairwoman of the South African Medical Association, Dr Angelique Coetzee spoke to Media and said that the Omicron variant of COVID-19 has mild symptoms and that the infected person does not suffer from loss of smell or taste. Meanwhile Covaxin may provide better protection against Omicron, said experts, even as other local vaccine makers assess the efficacy of their vaccine against the mutated variant Omicron.

ఒమిక్రాన్ లక్షణాలు తీవ్రత ఇలా.. కోవాగ్జిన్ టీకా ప్రభావంతం.!

Posted: 12/03/2021 06:49 PM IST
South african doctor who detected omicron strain lists symptoms

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’లో రీ-ఇన్ ఫెక్షన్ ప్రభావం కూడా మూడు రెట్లు అధికంగా వుందని, ఇది డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కోత్త వేరియంట్ ను తొలిసారిగా గుర్తించిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సెన్ డాక్టర్  ఏంజెలిక్ కొయెట్జీ ఒమిక్రాన్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇది డెల్టా, బీటా వేరియట్లకు చాలా భిన్నంగా వుందని అన్నారు. ఒమిక్రాన్ వైరస్ సోకినవారికి బీటా, డెల్టా వేరియంట్ తరహాలో రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపించదని తెలిపారు.

అంతేకాదు ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జర్వం.. నాడీ రేటు పడిపోవడం.. శరీరంలో ఆక్సిజన్ శాతం మందగించడం లాంటి లక్షణాలు కూడా కనిపించవని అమె తెలిపారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటాయన్నారు. కేవలం ఒక్కరోజు శరీరిక అలసట ఉందన్న అమె.. గొంతులో దురద ఉంటుందని తెలిపారు. డెల్టా వేరియంట్ తో పోల్చితే ఒమిక్రాన్ లో తీవ్రమైన లక్షణాలు లేవని అన్నారు. ఆసుపత్రిలో చేరే ముప్పు చాలా తక్కువేనని, ఇంట్లోనే నయం చేసుకోవచ్చన్నారు. కాగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ ఇది సోకినా.. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లతో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. టీకాలు వేయించుకోకుంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు.

కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్ పై కొవాగ్జిన్‌ టీకా ప్రభావంతంగా ఉంటుందని ఐపీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ టీకా ఒమిక్రాన్ వేరియంట్ పై మిగతా వ్యాక్సిన్ల కంటే మరింత ప్రభావంతంగా ఉంటుందన్నారు. ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ సాంకేతికతపై వ్యాక్సిన్‌ తయారైందని, ఇది కొత్త వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా ఉంటుందన్నారు. టీకా ఇంతకు ముందు వచ్చిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సైతం సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తు చేశారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కలిసి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Omicron  Angellque coetzee  covaxin  phfi  covid variant  covid  icmr  delta variant  omicron symptoms  

Other Articles