Bay of Bengal: Depression Likely To Intensify Into Cyclonic Storm తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం.. ఉత్తరాంధ్రకు ముప్పు..

Cyclone jawad bay of bengal depression intensifies into deep depression ap odisha on alert

Cyclone Jawad, Jawad Cyclone, Cyclone Jawad path, Cyclone Jawad track, Cyclone Jawad map, Cyclone Jawad satellite images, cyclone in bay of bengal, Cyclone Jawad latest news, India Meteorological Department, Andhra Pradesh, Odisha, Cyclone Jawad latest position

The India Meteorological Department (IMD) Friday said that the Depression in the southeast Bay of Bengal has intensified into a Deep Depression and lay centred at 05:30 am this morning over the westcentral and adjoining south Bay of Bengal.

ఉత్తరాంధ్రకు పోంచివున్న ముప్పు.. తీరం వైపు వేగంగా దూసుకోస్తున్న వాయుగుండం..

Posted: 12/03/2021 11:48 AM IST
Cyclone jawad bay of bengal depression intensifies into deep depression ap odisha on alert

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారగా ఇవాళ మరింత తీవ్రతరమై తీవ్రవాయుగుండంగా మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర సహా ఒడిశా తీరప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఇది ఇవాళ సాయంత్రానికి తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ్టి సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

వేగంగా వీచే ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు చెట్లు నేలకూలే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎల్లుండి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. జవాద్‌గా పిలుస్తున్న ఈ తుపాను రేపు ఉదయానికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పరిస్థితిని సమీక్షించారు.

అలాగే, తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక రోజు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నేటి నుంచి ఎల్లుండి వరకు విశాఖలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 65 రైళ్లను అలాగే, నేడు బయలుదేరాల్సిన పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు రద్దు చేయగా, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు.

జవాద్ తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై ప్రధానమంత్రి మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తుపాను ముప్పు తీవ్రంగా ఉండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వశాఖలతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్షించారు. కోస్టుగార్డు, నేవీ హెలికాప్టర్లు, నౌకలను సిద్ధం చేశారు. తుపాను శనివారం ఉదయం ఉత్తరాంధ్ర ఒడిశాలోని దక్షిణకోస్తాల మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపిన నేపథ్యంలో ఆయా ప్రాంత అధికారులను అప్రమత్తంగా ఉండి.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles