Landslide disrupts traffic on Tirumala ghat road తిరుమల కొండకు రాకపోకలు బంద్.. విరిగిపడిన కొండచరియలు

Ttd halts vehicles landslide in tirumala ghat road

Tirumala Tirupati Devasthanam, APSRTC buses, private Vehicles, TTD, Sri Vari darshanam, Tirumala Darshanam, Lord Balaji darshan, special darshanam tokens, Lord Venkateshwara swamy darshanam, YV SubbaReddy, Tirumala darshan, Landslide disrupts traffic on Tirumala ghat road, heavy rains, boulders and mounds of soil, uprooted trees, TTD Board, Dharma reddy, devotional

A landslide on the Tirumala ghat road caused temporary obstruction to vehicles. The road remained closed for repairs. With many vehicles of devotees en route to the Venkateswara temple stranded on the road, the TTD has been making alternative arrangements to remove the vehicles and to clear the road.

తిరుమల కొండకు రాకపోకలు బంద్.. విరిగిపడిన కొండచరియలు

Posted: 12/01/2021 12:13 PM IST
Ttd halts vehicles landslide in tirumala ghat road

కలియుగ వైకుంఠం తిరుపతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల కనుమదారులు దెబ్బతిన్నాయి. బుధవారం తెల్లవారుజామున తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డు సమీపంలో మరోసారి  భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు రెండో కనుమదారిని తాత్కాలికంగా మూసివేశారు. లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండపైనుంచి రహదారిపై భారీ బండరాళ్లు పడ్డాయి. ఈ కారణంగా తిరుపతి- తిరుమల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు ఘాట్ రోడ్డులో నిలిచిపోయాయి.

ఘాట్ రోడ్డుపై నేలకొరిగిన చెట్లతో పాటు భారీ బండారాళ్లు, మట్టిదబ్బలు అడ్డంగా ఉండటంతో పాటు రోడ్డు కూడా కొంత దూరం కోసుకుపోయింది. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాహనాలను నిలిపివేశారు. విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఇంజినీరింగ్, అటవీశాఖ అదికారులు కొండచరియలను తొలగిస్తున్నారు. కాగా, కొండచరియలు జారిపడే సమయంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో రెండో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

పక్షం రోజుల క్రితం తిరుమల కొండలపై కురిసిన భారీ వర్షాల కారణంగా నవంబర్ 18న మొదటి, రెండో ఘాట్‌లలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద బండరాళ్లు ఘాట్ రోడ్లపై పడ్డాయి. తీవ్ర ప్రయత్నాల అనంతరం మొదటి ఘాట్‌పై పడిన రాళ్లను టీటీడీ తొలగించింది. రహదారి, మరియు అదే ఘాట్‌లో నవంబర్ 19న తిరిగి రాకపోకలు ప్రారంభించబడ్డాయి. కాగా ఇవాళ తెల్లవారు జామున మరోమారు కొండచరియలు విరిగిపడటంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ విభాగంత తక్షణం రంగంలోకి దిగి పునరుద్దరణ పనులు చేపడుతోంది. వర్షాలకు మట్టి వదలు కావడం కారణంగానే కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles