Student kills 3, wounds 8 at Michigan school అమెరికా ఆక్స్ ఫర్డ్ స్కూళ్లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

3 dead 8 injured in michigan high school shooting in us

Gun culture, firing in US school, Michigan school shooting, US school shooting, school shooting Michigan, Michigan, Oxford high school, Shooting, students, Three dead, USA, Crime

A 15-year-old sophomore opened fire at his Michigan high school, killing three students and wounding eight other people, including a teacher, authorities said. Oakland County Undersheriff Mike McCabe said at a news conference that he didn’t know what the assailant’s motives were for the attack at Oxford High School in Oxford Township, a community of about 22,000 people roughly 30 miles (48 kilometers) north of Detroit.

అమెరికా ఆక్స్ ఫర్డ్ స్కూళ్లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

Posted: 12/01/2021 11:38 AM IST
3 dead 8 injured in michigan high school shooting in us

అమెరికా తుపాకీ సంస్కృతి మరోమారు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొనింది. అగ్రరాజ్యంలో మరోసారి గర్జించిన తుపాకీ ముగ్గురని బలితీసుకోవడంతో పాటు మరో ఎనమిది మంది విద్యార్థులను క్షతగాత్రులుగా మార్చింది. ఉపాధ్యాయుల పాఠాలు.. విద్యార్థుల అల్లర్ల మధ్య ఒక్కసారిగా జరిగిన కాల్పుల మోతతో భీతావాహ వాతావరణం అలుముకుంది. తన సహచర విద్యార్థులపైకి పదిహేనేళ్ల  అదే పాఠశాలకు చెందిన విద్యార్థి తుపాకీతో కాల్పులు జరపడానికి అగ్రరాజ్యంలో వున్న తుపాకీ సంస్కృతే కారణమన్న అరోపణలు వినబడుతున్నాయి.

మిచిగాన్ లోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో 15 ఏండ్ల బాలుడు తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో 16 ఏళ్ల బాలుడు, 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని డెట్రాయిట్ నగర భద్రతాధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఘటన అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిందన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకున్నామని.. నిందితుడైన 15 ఏళ్ల విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఓ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గాయపడినివారిలో ఇద్దరికి సర్జరీ జరిగిందని, మరో ఆరుగురు క్షేమంగా ఉన్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gun culture  firing in US school  Michigan  Oxford high school  Shooting  students  Three dead  USA  Crime  

Other Articles