Woman thrashes cab driver on road in Delhi క్యాబ్ డ్రైవర్ పై చేయిచేసుకున్న మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్..

Woman seen assaulting cab driver in viral video fir registered

Delhi woman, Delhi women thrashing, cab driver, FiR registered, Block-22, Kasturi Lal Anand Marg, West Patel Nagar. Delhi, viral video, trending video, video viral, Crime

A video of a woman beating a cab driver in the middle of the road in Delhi is going viral. The video is from the ​​West Patel Nagar police station area. In the 2-minute-long video, a woman wearing a blue t-shirt and mask on her face is holding the collar and thrashing the cab driver in the middle of the road

ITEMVIDEOS: క్యాబ్ డ్రైవర్ పై చేయిచేసుకున్న మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్..

Posted: 11/17/2021 07:12 PM IST
Woman seen assaulting cab driver in viral video fir registered

దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళ, క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. ఒక్కసారి కాదు ఏకంగా ఐదు సార్లు అలాగే కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటి కొన్ని నెలల క్రితం రోడ్డు దాటుతున్న యువతి తనను క్యాబ్ డ్రైవర్ ఢీకొంటాడేమోనన్న అందోళనలో కోట్టిన ఘటన గురించి ఇప్పుడు చెబుతున్నారేంటీ అంటారా.? ఈ ఘటనకు ఆ ఘటనకు ఏ మాత్రం సంబంధమే లేదు. అయితే ఈ రెండు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలోనే చోటుచేసుకున్నాయి.

ఆ ఘటన గురించి పక్కనబెడితే  ఈ ఘటనకు సంబంధించిన వివరాలల్లోకి వెళ్తే.. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి వాహనానికి ఒక క్యాబ్‌ డ్రైవర్‌ దారి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన నీలం కలర్ టీ షర్టు ధరించిన మహిళ క్యాబ్‌ డ్రైవర్‌ను కారు నుంచి బయటకు లాగింది. అందరూ చూస్తుండగా చొక్కా పట్టుకుని దూషిస్తూ అతడి చెంపపై కొట్టింది. ఇలా ఒక్కసారి కాదు ఐదు స్లారు కోట్టింది. అక్కడున్న కొందరు సర్ది చెప్పేందుకు యత్నించగా వారిపై కూడా ఆ మహిళ విరుచుకుపడింది.

కాగా, కొందరు ఈ ఘటనను తమ మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఆదిత్య సింగ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ దీనిని పోస్ట్‌ చేశారు. ఆయన మాత్రమే మహిళ దాడిని అడ్డుకుని.. ప్రశ్నిస్తూ ఏంటీ ఎందుకని కొడుతున్నావ్ అని ప్రశ్నించారు. క్యాబ్ డ్రైవర్ ఎలాంటి తప్పు చేయకున్నా ఆయన చెంపను ఐదుసార్లు కోట్టారు. ఇదే మీకు జరిగితే ఊరుకుంటారా.? అని నిలదీశాడు. ఈ ఘటన చూసి తాను చాలా బాధపడినట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు క్యాబ్‌ డ్రైవర్‌ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. అయితే ద్విచక్ర వాహనం నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి చేసిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles