SC appoints retired judge to monitor Lakhimpur case లఖీంపూర్ ఖేరీ ఘటన దర్యాప్తుకు పర్యావేక్షణ అధికారి నియామకం

Sc appoints retd hc judge to monitor lakhimpur kheri violence case

Lakhimpur Kheri violence, Lakhimpur Kheri violence supreme court, Lakhimpur Kheri violence judge, Rakesh Kumar Jain, SC appoints former Punjab and Haryana HC judge to monitor Lakhimpur Kheri violence case, Uttar Pradesh, Crime

The Supreme Court Wednesday appointed retired Punjab and Haryana High Court judge Rakesh Kumar Jain to monitor the investigation in the Lakhimpur Kheri matter. It also reconstituted the Special Investigation Team (SIT) by appointing three more senior police officers.

లఖీంపూర్ ఖేరీ ఘటన దర్యాప్తుకు పర్యావేక్షణకు మాజీ న్యాయమూర్తి నియామకం

Posted: 11/17/2021 06:28 PM IST
Sc appoints retd hc judge to monitor lakhimpur kheri violence case

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పునర్ వ్యవస్థీకరించింది. ఈ కేసును సమోటోగా తీసుకుని విచారణను ప్రారంభించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రఅహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఇవాళ కేసు దర్యాప్తును ముమ్మరంగా ముందుకు సాగే చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో సిట్ ను పునర్ వ్యవస్థీకరించిన న్యాయస్థానం.. ఈ కేసు దర్యాప్తును పూర్తిస్థాయిలో పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలోనే జరగాలని అదేశించిన విషయం తెలిసిందే.

కాగా ఇవాళ అత్యున్నత న్యాయస్థానం అందుకు పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేశ్ కుమార్ జైన్ కు అప్పగించింది. ని పర్యవేఅసంతృప్తి వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటన దర్యాప్తు విషయంలో పారదర్శకతను కొనసాగించేందుకు అవసరమైన చర్యలు కోర్టు పేర్కొన్నది. హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్‌ సర్కారును ఆదేశించగా, అందుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం కూడా తమ సమ్మతిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు న్యాయమూర్తులు రాకేశ్‌ కుమార్‌ జైన్‌, రంజిత్‌ సింగ్‌ పేర్లను సూచించింది.

అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటనపై గడిచిన కొన్ని వారాలలో ఆరవ పర్యాయం విచారించిన న్యాయస్థానం.. ఈ కేసును దర్యాప్తును చేపట్టేందుకు మరికొంత మంది సీనియర్‌ పోలీసు అధికారులను సిట్‌లో చేర్చాల్సిందిగా ఆదేశించింది. తాజాగా సిట్‌ను పునర్వ్యస్థీకరిస్తూ.. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు చోటు కల్పించింది. ఇందులో ఎస్‌బీ శిరోద్కర్, దీపిందర్ సింగ్, పద్మజా చౌహాన్ పేర్లు ఉన్నాయి. ఇక ఇప్పటికైనా ఈ కేసులోని బాధితులకు న్యాయం జరుగుతుందని బాధిత కుటుంబాలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles