Man held for cheating 20 women with hair wig photo ఆ పని చేస్తే కంపెనీ సీఈఓనే కొట్టేస్తోందీ ఉద్యోగి..

Entrepreneur hires woman to slap him whenever he s on facebook

woman job to beat ceo, hiring a girl for beating CEO, Pavlok CEO manish sethi, pavlok CEO Maneesh Sethi hires a woman, Tesla and SpaceX CEO Elon Musk, facebook, social media, twitter, elon musk, manish sethi, Pavlok founder, woman, Kara, craigslist, social media, viral news

An Indian-American entrepreneur hired a woman to slap him every time he logs into his Facebook account. Maneesh Sethi, the founder of the wearable device brand Pavlok, reportedly hired a woman named Kara for $8 an hour to monitor his screen and slap him if he went on the social media platform.

ఆ పని చేస్తే కంపెనీ సీఈఓనే కొట్టేస్తోందీ ఉద్యోగి.. అదే తన జాబ్..

Posted: 11/13/2021 12:53 PM IST
Entrepreneur hires woman to slap him whenever he s on facebook

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో తెలిసిందే. నిరుద్యోగ యువత మొదలుకుని కంపెనీ సీఈఓల వరకు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిత్యం యాక్టివ్ గా వుంటారు. కొందరు తమ సంస్థ ఉత్పత్తులపై ఇక్కడ క్లారిటీ ఇస్తూ.. నూతన ఉత్పదకతలను కూడా పరిచయం చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇతరలు పంపిన సందేశాలలో మునిగితేలుతుంటారు. వారి పోస్టులకు కామెంట్లు పెడుతూ.. స్నేహితులతో కలసి ముచ్చటించేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ఇది ఉద్యోగులు, సీనియర్ ఉద్యోగుల వరకు మాత్రమే పరిమితం కాలేదు.

మేనేజ్ మెంట్ స్థాయిలోని వ్యక్తులతో పాటు కంపెనీ సీఈఓ స్థాయివరకు అందరినీ సోషల్ మీడియా ప్రభావితం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఫేస్‌ బుక్‌ లో గడిపే సమయాన్ని తగ్గించుకునేందుకు ఓ కంపెనీ సీఈవో చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాల్వొక్ సంస్థ సీఈవో మనీష్‌ సేథి తాను ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా కొట్టడానికి ఓ మహిళను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఫేస్‌బుక్ చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రాగ్ లిస్ట్ అనే ఎంప్లాయిమెంట్ వెబ్ సైట్లో గంటలకు 8 డాలర్లు వేతనాన్ని అందించనున్నట్లు ప్రకటించాడు. అంతే ఆ యాడ్ చూసిన కారా అనే మహిళ వచ్చి ఆ ఉద్యోగంలో చేరింది.  అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 అన్నమాట.

ఈ ప్రక్రియ వల్ల తనకు చాలా సమయం మిగులుతోందని అంటున్నాడు మనీష్‌. ఈ కారాను నియమించుకోవడం కారణంగా తాను పూర్తి సమయాన్ని తన సంస్థపై, తన విధులపై కేటాయించగలుగుతున్నానని చెప్పుకోచ్చాడు. దీంతో తన కంపెనీ ఉత్పాదకతను ఏకంగా 98 శాతం తీసుకెళ్లగలిగే స్థాయికి చేరుకున్నానని గర్వగా చెప్పుకోచ్చాడు. సమయాన్ని వ్యాపారంపై దృష్టి పెడుతున్నానని చెబుతున్నాడు. అయితే ఈ విషయం తెలిసి టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలన్ మస్క్ కాస్త ఫన్నీగా స్పందించాడు. రెండు ఫైర్ ఎమోజీలను పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన మనీష్‌.. ఫైర్ గుర్తులకు అర్థం ఏంటో కాలమే నిర్ణయిస్తుందని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  social media  twitter  elon musk  manish sethi  Pavlok founder  woman  Kara  craigslist  social media  viral news  

Other Articles