Kerala reports 13 cases of Norovirus కేరళలో కొత్తగా నోరో వైరస్.. వాయనాడ్ జిల్లాలో 13 కేసులు..

Norovirus outbreak in kerala wayanad district reports 13 cases

norovirus, norovirus treatment, norovirus symptoms, norovirus transmission, norovirus 2021, norovirus symptoms in adults, norovirus incubation period, norovirus precautions, norovirus is not spread by, norovirus outbreaks, norovirus vs coronavirus, how long does norovirus last, how is norovirus spread, how long is norovirus contagious, what treatment is used for norovirus, norovirus kerala, kerala reports norovirus

Kerala has been put on alert after at least 13 cases of norovirus have been recorded in Wayanad district. The infection was reported in some 13 students of a veterinary college in Pookode near Vythiri in Wayanad district two weeks ago. As State health minister Veena George asked people to be vigilant, here's a look at what the virus is, its symptoms and what can be done to treat it.

కేరళలో కొత్తగా నోరో వైరస్.. వాయనాడ్ జిల్లాలో 13 కేసులు..

Posted: 11/13/2021 11:40 AM IST
Norovirus outbreak in kerala wayanad district reports 13 cases

కేరళలో మరో కొత్తవైరస్ కలకలం రేగింది. నోరో వైరస్ గా పిలువబడే ఈ వైరస్ కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రబలుతోంది. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ మనుషులకు నీరు, అహారం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా నోరో వైరస్ సోకుతుందని అన్నారు. నోరో వైరస్ కేసులను కేరళలోని వాయనాడ్ లో గుర్తించారు. జిల్లాలోని పూకోడ్ సమీపంలోని వైతిరి వద్దనున్న వెటర్నరీ కాలేజీలో రెండు వారాల క్రితం 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. దీంతో కేరళలో కొత్త వైరస్ ప్రబలుతోందన్న వార్తలు తెరపైకి వచ్చాయి.

దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి స్పందిస్తూ... నోరో వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ వైరస్ మరింత ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో దీని పట్ల విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించాలని అధికారులను ఆదేశించారు. వాయనాడ్ లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వీణా జార్జి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి ముప్పు లేకపోయినా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. అయితే అరోగ్యవంతులపై ఈ వైరస్ ప్రభావం చూపలేదని.. కాగా పెద్దలు, ఎదుగుతున్న పిల్లలపై మాత్రం ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అన్నారు.

నోరో వైరస్ లక్షణాలు..

నోరో వైరస్ అనేది అనేక రకాల వైరస్ ల సమూహం. ఇది ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి అస్వస్థతకు గురిచేస్తుంది. ఉదరం, పేగుల్లోని కీలక పొరను దెబ్బతీస్తుంది. దీని ప్రభావంతో తీవ్రస్థాయిలో వాంతులు, విరేచనాలతో బాధపడతారు. డయేరియా, కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలను ఈ వైరస్ కలిగిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని తెలిపారు. ఇతర వ్యాధులతో బాధపడేవారికి నోరో వైరస్ ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు తెలిపారు.

కేరళ అరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు:-

చేతులను భోజనం ముందు, తరువాత పరిశుభ్రంగా కడుకోవడం..
టాయిలెట్ కు వెళ్లొచ్చిన తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
కులషిత ఆహారాన్ని, నీళ్లను తీసుకోకూవడదు
జంతువుల సన్నిహితంగా వుండేవారు అత్యంత జాగ్రత్తలు పాటించాలి
బావులు, చెరువుల నుంచి నీరు తాగేవారు వాటిని క్లోరినేషన్ చేయాలి.
వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి.
అనారోగ్యంతో బాధపడేవారు కనీసం రెండు రోజులు ఇంటిపట్టునే ఉండాలి.
పండ్ల రసాలను విరివిగా తీసుకోవడం వల్ల ఈ వైరస్ సోకినా త్వరగా బయటపడవచ్చు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles