BJP leaders watching PM's live, held hostage by farmers బీజేపి ఎంపీ కారు ధ్వంసం.. కాషాయ నేతల ఆలయ నిర్భంధం..!

Farmers protest bjp mp s car smashed over jobless alcoholics remark

BJP Rajyasabha MP, Ram Chander Jangra, Farmers protest, farm law protest, Jobless alcohalics jibe, Car Windshield, BJP leaders held hostage by farmers, rohtak, haryana, haryana farmers protest, pm modi, PM Modi's Kedarnath programme, Haryana, Politics

BJP Rajya Sabha member Ram Chander Jangra faced slogans and black flags by a group of farmers in Haryana's Hisar district as he arrived in Narnaund city to inaugurate a dharmshala. The windshield of his car was also smashed in a fight between the police and the farmers. Former Haryana Minister Manish Grover and several other BJP leaders were held hostage by protesting farmers, While watching PM Modi's programme in Kedarnath live at a temple in Rohtak's Kiloi village

రైతన్న నిరసనలు: బీజేపి ఎంపీ కారు ధ్వంసం.. కాషాయ నేతల ఆలయ నిర్భంధం..!

Posted: 11/05/2021 07:15 PM IST
Farmers protest bjp mp s car smashed over jobless alcoholics remark

హర్యానాకు చెందిన రైతులు కదం తోక్కుతున్ారు. దాదాపుగా ఏఢాది కాలంగా తము నిరసన ప్రదర్శనలు చేస్తున్నా కేంద్రంలోని బీజుపి ప్రభుత్వం నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవడంలో ఇంకా జాప్యం చేస్తున్నడంతో రైతన్నల అక్రోశం కట్టలు తెగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇటీవల జరిగిన ఉపఎన్నికలో ఓటమిని చవిచూసిన బీజేపి.. తమకు ఇంధన ధరల సెగ తగిలిందని భావించి వెంటనే ఎక్సైజ్ సంకాన్ని తగ్గించింది. అయితే తాము ఏడాది నుంచి నిరసలు చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు అవేదన చెందారు.

ఈ క్రమంలో బీజేపి నేతలు తమపై నోరుజారుతున్న క్రమంలో వారిపై తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ పని లేని తాగుబోతులని విమర్శించారు. బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్‌ చేశారు. దీనిపై రైతులు ఆందోళనకు దిగారు. ఇక మరోవైపు కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ లైవ్‌ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానిక గుడికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు చుట్టుముట్టి నిర్బంధించారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను ఆరు గంటలకుపైగా గుడిలో రైతులు నిర్బంధించారు.

ఇటీవల ఆయన రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీని కోసం ఆయనకు అర గంట సమయాన్ని రైతులు ఇచ్చారు. పార్టీ సంస్థాగత మంత్రి రవీంద్రరాజు, మేయర్ మన్మోహన్ గోయల్, బీజేపీ జిల్లా చీఫ్ అజయ్ బన్సల్, పార్టీ నాయకుడు సతీష్ నందాల్ కూడా గుడిలో ఉండిపోయారు. బీజేపీ నేతలున్న గుడిని చుట్టుముట్టిన రైతులను వెళ్లగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సోనిపట్, ఝజ్జర్ నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఇద్దరు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. మరింత మంది రైతులు అక్కడకు రాకుండా ఢిల్లీ-హిసార్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను కూడా నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles