ACB Officials Ran 1 Km To Catch Accused SI ఠాణా నుంచి ఎస్ఐ పరుగో పరుగు..! ఎందుకంటే..

Acb officials ran 1 km to catch sub inspector who accused of bribery

Chandranna, Vehicle seizure, Sub Inspector Accused Of Bribery, ACB Officials Run 1 Km To Catch Sub Inspector, Constable Nayaz Ahmed, Sub Inspector, Somashekhar, ACB Inspector Vijayalakshmi, Chandrashekhar Pura police station, Gubbin taluk, Karnataka, Crime

A shocking incident was seen on the streets of Tumkur city of Karnataka. Here two police officers were seen running on the road to nab a sub-inspector. Actually, on the sub-inspector allegation of bribery Is. The accused sub-inspector Somashekhar, wearing a half-finished uniform, was caught with the help of the general public after a chase of about a kilometer.

ITEMVIDEOS: ఖాకీ షర్టు విప్పి.. ఠాణా నుంచి ఎస్ఐ పరుగో పరుగు..! ఎందుకంటే..

Posted: 11/05/2021 05:00 PM IST
Acb officials ran 1 km to catch sub inspector who accused of bribery

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే. అమ్యామ్యాలకో, అక్రమాలకో, లాభాలకో.. తమవారికి మేలుకోసమో.. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా అలాంటి అధికారంలో కొనసాగుతున్న అధికారులు ఇవి తప్పక పాటించాలి. తప్పులు చేసేప్పుడు ఒక్క క్షణం అలోచిస్తే.. వాటిని చేసేందుకు కూడా మనస్సు అంగీకరించదు. ప్రలోభాలకు గురై ఎదుటివారిచ్చే లాభాలనో.. ఎదుటివారి పని చేయాలంటే లాభాన్ని ఆర్జించడం వల్లనో మనస్సు మాట వినకుంటే పర్యవసానం కూడా అనుభవించాల్సి ఉంటుంది.

ఇప్పుడు అలాంటి పర్యవసానం అనుభవించాల్సి వచ్చిన తరుణంలో తప్పించుకునేందుకు కిలోమీటరు మేర పరుగు తీశాడు ఓ సబ్ ఇన్స్ పెక్టర్. అదేమంటే.. అమ్యామ్యాలకు అలవాటు పడి.. ప్రతీ పని చేసేందుకూ లంచం కావాలని డిమాండ్ చేసేవాడు. అయితే లంచాలను తాను స్వయంగా తీసుకోకుండా తనకు నమ్మినబంటులా వున్న కానిస్టేబుల్ ను పంపి అన్ని సమకూర్చుకునేవాడు. దొరికితే అతను పోతాడు. కానీ తాను సేఫ్ అనుకున్నాడు. ఈ క్రమంలో కానిస్టుబల్ ఏసీబి అధికారులకు అడ్డంగా దోరికిపోవడంతో.. ఇక తనే నెక్ట్స్ అనుకున్న ఎస్ఐ తనను ఏసీబి అధికారులు గుర్తించకుండా.. తన యూనిఫాం తీసేసి మరీ రోడ్డుపై పరుగులు పెట్టాడు.

కిలోమీటరు పాటు పరుగు లఖించుకున్నా.. ఏపీబి అధికారులు కూడా అతడ్ని వెంబడించారు. ఇక స్థానికులకు ఈ విచిత్రాన్ని చూస్తుండటంతో పట్టుకోండి పట్టుకోండి అని ఏసీబి అధికారుల అరుపులతో ఎస్ఐను పట్టుకుని ఏసీబి అధికారులకు పట్టించారు స్థానికులు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరులో జరిగింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. తుముకూరు గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరా పోలీసులు ఓ కేసులో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. రూ. 28 వేలు లంచం తీసుకుని ఆ వాహనాన్ని విడిచిపెట్టాలని ఎస్సై సోమశేఖర్ కానిస్టేబుల్‌ నయాజ్ అహ్మద్‌కు చెప్పాడు. బాధితుడు చంద్రన్న వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎస్సై కోసం వారు కాపుకాశారు.

ఈ క్రమంలో రూ. 12 వేలు తీసుకుంటున్న కానిస్టేబుల్‌ను బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై తీసుకోమంటేనే తాను లంచం తీసుకున్నానని కానిస్టేబుల్ చెప్పడంతో అతడితో కలిసి స్టేషన్‌కు బయలుదేరారు. ఏసీబీ అధికారులు తన కోసం వస్తున్నారని గుర్తించిన ఎస్సై తన యూనిఫాం చొక్కాను అక్కడి చెత్తబుట్టలో పడేసి స్టేషన్ నుంచి బయటకు వచ్చి పరుగులు తీశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు అతడిని వెంబడించారు. అలా దాదాపు కిలోమీటరు దూరం అతడి వెనక పరుగులు తీశారు. చివరికి స్థానికుల సాయంతో ఎస్సై సోమశేఖర్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 
 
 
View this post on Instagram

A post shared by NDTV (@ndtv)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sub Inspector  Somashekhar  Constable  Nayaz Ahmed  ACB  Chandranna  Vehicle seizure  gubbin  Karnataka  Crime  

Other Articles