దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్కడి ప్రజలు వాయుకాలుష్యంపై ఎలాంటి అవగాహన లేకుండా నిన్న రాత్రి కాల్చిన బాణాసంచా ధాటికి ఈ పరిణామం చోటుచేసుకుంది. బాణసంచాపై ఢిల్లీ నిషేధం విధించినప్పటికీ ప్రజలు ఆ నిబంధనలను పట్టించుకోకుండా బాణాసంచా కాల్చారు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం చేసిన విన్నపాలను గాలికి వదిలేయడంతో.. గాలి పీల్చితే రోగాలు వచ్చే స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. దీపావళి రాత్రే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరువలోకి చేరిగా, ఇవాళ ఉదయం నాటికి ప్రజలపై కాలుష్య కాటువేసే స్థాయికి చేరింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఇవాళ ఉదయం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత పరిధి 25ను దాటింది. ఇక అదే సమయంలో పీయూఎస్‌ఏ, లోధి, మధుర రోడ్‌లు, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఢిల్లీవాసుల దెబ్బకు పరిసర ప్రాంతాలైన ఫరిదాబాద్, గజియాబాద్, గుర్ గావ్, నోయిడాలలో నూ గాలి నాణ్యతలోని పర్టికులేట్ మ్యాటర్ (పీఎం) 424, 442, 423, 431గా నమోదైంది.
గాలి కాలుష్యం నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినా.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీవాసులు ఆంక్షలను తుంగలో కలపడమే ఈ పరిణామానాకి కారణం. కాగా ఈ స్థాయికి వాయుకాలుష్యం చేరడంతో.. ఇవాళ ఉదయం ఢిల్లీపై పొగమంచు తెర కప్పేసింది. దీంతో గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచివుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ గాలిలో తిరిగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. అయితే కాలుష్యనియంత్రణ మండలి అధికారులు మాత్రం గాలి నాణ్యత రెండు రోజుల్లో తిరిగి సాధారణ స్థాయికి రావచ్చని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more