ఆన్ లైన విద్యల పేరుతో చేతిలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లు.. చిన్నారుల మదిని పరిపరి విధములు పాడు చేస్తోంది. ఏ చిన్నారికైన సెల్ పోన్ ఇవ్వగానే అందులో అన్ లైన్ పాఠాల బదులు గేమ్స్ అడుతారని పెద్దలు భావిస్తుంటారు. కానీ చిన్నారి బుర్రలో ఎన్నో ఆలోచనలు.. ఏది నొక్కితే ఏం వస్తుందో తెలుసుకోవాలన్న జిజ్ఞసతో అన్వేషణ మొదలు పెడతారు. ఇలాంటి ఉత్సుహకత వారిలో ఉండటం సబబే. అయితే పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేప్పుడు అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే లాక్ చేసుకోవడం ఎంతో మంచింది. అలా కానీ పక్షంలో ఆ ఫైల్స్ చెరిగిపోయే అవకాశం ఉంటుంది.
ఇలానే అన్ లైన్ లో తరగతులను చదివేందుకు ఓ విద్యార్థి తన తండ్రి వద్ద సెల్ ఫోన్ తీసుకోగా.. అందులో అడల్ట్ మెటీరియల్ చాలా వుంది. వాటిని డౌన్ లోడ్ చేసి పెట్టుకన్న ఆయన వాటి గురించి పూర్తిగా మర్చిపోయి.. తన సెల్ ఫోన్ ను తన తనయుడికి ఇచ్చాడు. అంతే అక్కడి వరకు చేరుకోవడం పెద్దగా కష్టపడకుండానే సాధ్యమైన విద్యార్థి.. వాటినీ ఒంటరిగా చూస్తూ.. ఆ తరువాత తన స్నేహితులతో కలసి చూడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటి పక్కనే ఉండే ఆరేళ్ల బాలికను కూడా తీసుకుళ్లగా అమె వాటిని చూసేందుకు నిరాకరించి వెనుదిరిగింది.
దీంతో అశ్లీల చిత్రాలు చూసేందుకు నిరాకరించిందన్న కోపంతో ముగ్గురు బాలలు ఆరేళ్ల బాలికను రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అస్సాంలోని నగావ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. కలియబర్ పట్టణ పరిధిలోని మిస్సా గ్రామానికి చెందిన 8 నుంచి 11 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలలు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటు పడిన వీరు మంగళవారం మధ్యాహ్నం బాధిత బాలికను గ్రామంలోని క్వారీ వద్దకు రమ్మని పిలిచారు. సెల్ ఫోన్ లోని నీలి చిత్రాలను చూడాలని బాలికను ఒత్తిడి చేశారు.
అందుకు చిన్నారి నిరాకరించడంతో కోపంతో పక్కనే ఉన్న రాళ్లతో ఆమెను కొట్టి చంపేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. క్వారీలోని మరుగుదొడ్డి వద్ద బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. నేరాన్ని దాచేందుకు యత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి ఎస్పీ ఆనంద్ మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో నైతిక విలువలు పడిపోతే దానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుందని, ఈ ఘటన అందుకు నిదర్శమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more