Ananya Pandey to be QUIZZED by the NCB అనన్య పాండే.. అర్యన్ కు గంజా సమకూరుస్తానందా.?

Ananya pandey to be quizzed by ncb for second day on arranging ganja

Shah Rukh Khan, Aryan Khan, Arthur Raod Jail, Mulakaat, bail denied, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan meet his son aryan khan, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

Ananya Panday was grilled for nearly three hours and will be questioned by the NCB again on Friday. The agency asked Ananya to appear before it at 11 am on Friday.

రెండో రోజు నటి అనన్యా పాండేను విచారించనున్న ఎన్సీబి.!

Posted: 10/22/2021 01:19 PM IST
Ananya pandey to be quizzed by ncb for second day on arranging ganja

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్..అదే రోజున వర్తమన నటి అనన్య పాండేతో వాట్సాప్ చాట్ నేపథ్యంలో గురువారం ఉదయం అటు నటి ఇంటిపై దాడి చేసిన ఎన్సీబి అధికారులు పలు అధారాలను స్వాధీనం చేసుకున్నారు. నటిక ిచెందిన ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని తమ వెంట తీసుకెళ్లారు. ఆర్యన్ ఖాన్.. అనన్య పాండేల మధ్య ఛాట్ సంభాషణలతో పాటు ఫోన్ కాల్స్ పై కూడా విచారించనున్నారు అధికారులు.

ఇక ఈ నేపథ్యంలోనే అమెకు విచారణకు హాజరుకావాల్సిందిగా కూడా ఎన్సీబి అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమె ఎన్సీబి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో మాదకద్రవ్యాల కేసులో అమె వాంగ్మూలన్ని కూడా రికార్డు చేసిన అధికారులు ఆమెను గంట పాటు పలు విషయాలపై ప్రశ్నలు వేశారని సమాచారం. అయితే విచారణకు హాజరయ్యే ముందు తీవ్ర అందోళనకు గురైన అమె విచారణ గదిలోకి రాలేదని తెలసింది. కాగా తన తండ్రి బాలీవుడ్ నటుడు చుంకీ పాండేతో పాటుగా విచారణకు వెళ్లిన నటి.. ఓ సందర్భంలో తీవ్ర అందోళనకు లోనై ఏడ్చేసింది. అయితే అమె తండ్రి అమెకు ధైర్యం చెప్పి విచారణకు తీసుకువెళ్లారు.

కాగా అర్యన్ ఫోన్ లోని వాట్సాప్ చాట్ లను పరిశీలించిన అధికారులు అనన్య పాండేతో జరిగిన చాట్ సంబాషణలపై దృష్టి సారించారు. ఇందులో అ రోజు పార్టీకి అమెను కూడా రమ్మని అర్యన్ ఖాన్ అహ్వానించారు. అంతేకాదు.. పార్టీకి వస్తూ గంజాయిని కూడా తీసుకురావాలని కోరాడు. దీంతో దానికి అమె సరేనని.. తాను తీసుకువస్తానని చెప్పినట్టుగా చాట్ సంబాషణ సాగింది. దీంతో అర్యన్ ఖాన్ కు గంజాయిని అందించింది అనన్య పాండేనేనా అన్న కోణంలో ఇవాళ విచారణ సాగనుంది. ఈ క్రమంలో అనన్య తాను అర్యన్ ఖాన్ తో కేవలం జోక్  చేశానని చెప్పుకోచ్చింది. ఇక దీనిపై స్పందించిన ఎన్సీబి అధికారులు అనన్య గంజాయి సమకూర్చిందని ఆధారాలు లేవని తెలిపారు.

కాగా క్రితంరోజున షారుక్ ఖాన్ నివాసానికి కేవలం కేసుకు సంబంధించిన మెటీరియల్ కోసమే వెళ్లామని, రైడ్ కాదని ఎన్సీబి అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8 నుంచి ముంబైలోని అర్థర్ రోడ్డులోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా వున్న ఆర్యన్ ఖాన్ ను మూడు వారాల తరువాత షారుక్ ఖాన్ కలిసిన విషయం విధితమే. రెండు రోజలు క్రితం ముంబై ప్రత్యేక కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను రెండవ పర్యాయం తిరస్కరించిన క్రమంలో ఆయన తరపు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ఈ నెల 26న విచారించనుంది. దీంతో 26న ఆర్యన్ ఖాన్ కు తాత్కాలిక ఊరట లభించనుందా.? లేదా అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles