Dera Baba and four others get life imprisonment శిష్యుడి హత్యకేసులో డేరా బాబకు జీవితఖైదు

Dera chief gurmeet ram rahim four others get life imprisonment for murdering follower

Dera Sacha Sauda chief, Gurmeet Ram Rahim Singh convicted murder case, special CBI court, Dera manager murDera Sacha Sauda chief, Gurmeet Ram Rahim Singh convicted murder case, special CBI court, Dera manager murder,Rohtak, Haryana, crime der,Rohtak, Haryana, crime

Out on bail in the Malegaon blasts case on medical grounds, BJP MP Sadhvi Pragya Singh Thakur has come under fire yet again after a video of her playing kabaddi surfaced online. Critics were quick to point out that the MP did not appear to be suffering from any major ailments, as she has previously claimed.

మేనేజర్ హత్యకేసులో డేరాబాబా సహా ఐదుగురికి జీవితఖైదు

Posted: 10/18/2021 05:16 PM IST
Dera chief gurmeet ram rahim four others get life imprisonment for murdering follower

సిర్సా ఆధారిత వర్గం డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం హంతకుడేనని పది రోజుల క్రితం నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు జీవితఖైదు శిక్షను విధిస్తూ ఇవాళ తీర్పును వెలువరించింది. పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ సుశీల్ కుమార్ గార్గ్ ఈ మేరకు ఇవాళ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. 2002 జులై 10 నాటి హత్య కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి గార్డ్..ఈ హత్యకేసులో దోషులుగా తేలిన మరో నలుగురికి కూడా జవీవిత ఖైదు శిక్షనే ఖరారు చేశారు.

2002 హత్య కేసుకు సంబంధించి డేరాబాబాతో పాటు మరో నలుగురు దోషులకు ఈనెల 8న దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం ఇవాళ శిక్షలను ఖరారు చేసింది. వాస్తవానికి ఈ నెల 12నే శిక్షలను ఖరారు చేయాల్సివున్నా అనివార్య కారణాల వల్ల శిక్షల ఖరారు ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో న్యాయస్థానం ఈ హత్యకేసుతో ప్రమేయమున్న డేరా బాబా సహా కిషన్ లాల్, జస్బిర్ సింగ్,  అవతార్ సింగ్, సబ్దిల్ సింగ్ లకు కూడా జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. పైగా సబ్దిల్ సింగ్, జస్బిర్ సింగ్ లు ఆయుధాలను కూడా కలిగివున్నారని న్యాయస్థానంలో నిరూపితమైంది.

కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా

2002లో డేరా సచ్చా సౌధలో ఆయన ముఖ్య అనుచరుడు, తన మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేశారని రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదుమేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

కాగా, ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది. కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ ప్రస్తుతం హర్యానాలోని రోహ్‌తక్ సమీపంలోని సునారియా జైలులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles