తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు అంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణపై వరుణుడు పగబట్టినట్టుగా కుండపోత వర్షాలను కురిపిస్తున్నాడు. నైరుతి పవనాల ప్రభావం తిరుగు పయనం అయినా.. తెలంగాణను మాత్రం వరుణుడు వదల్లేదు. జూన్ నుంచి కురిపిస్తున్న వర్షాలతో జూలై నాటికే రాష్ట్రంలోని జలాశయాలన్ని నిండుకుండలను తలపించాయి. ఇక అప్పటి నుంచి కురుస్తున్న వర్సం లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తోంది. జూన్ నుంచి ప్రతీ వారం నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే వున్నాయి.
తాజాగా నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అనేకప్రాంతాల్లోకి వరద నీరు నిండుకోవడంతో జనజీవనం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలు పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని చాలా కాలనీల్లోకి వరద నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రోడ్డు జలాశయాలను తలపించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలను ఎదుర్కోన్నారు.
అటు సరూర్ నగర్ ప్రాంతంలోని గడ్డిఅన్నారంలోగల శివ గంగ థియేటర్ను వరద నీరు ముంచెత్తింది. భారీ వరద నీరు చేరడంతో ఏషియన్ శివ గంగా థియేటర్ పూర్తిగా వరద నీటలో మునిగింది. ధియేటర్ ప్రహరీ గోడ కూలండంతో నీరు ఏకంగా ధియేటర్ లోనికి చేరింది. ధియేటర్ లోని వెండితెరతో పాటు కుర్చీలపై నుంచి వరద నీరుఉదృతంగా ప్రవహించింది. థియేటర్లో నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అది శివగంగ ధియేటర్ లోని దృశ్యాలేనా లేక మార్పింగ్ వీడియోలా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
This is Video is floating left right and centre stating Shiv Ganga theatre. Can somebody please check if this is True.@PhotoHyderabad @HyderabadHello @shanthchandra @PintodeepakD @revathitweets @EE_Saroornagar pic.twitter.com/jZHckXPKBk
— Malakpet Diaries - Stay Safe & Wear Mask (@MalakpetD) October 9, 2021
కాగా ధియేటర్ కు సంబంధించిన మరో వీడియో కూడా నెట్టింట్లో వైరల్ కావడతో అది శివగంగ థియేటర్ లోని దృశ్యాలని నెటిజనులు నిర్థారించుకున్నారు. ఇక ప్రహరీ గోడ కూలిన ఘటనలో.. అక్కడే పార్కు చేసిన దాదాపు 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలపైనే ప్రహరీ గోడ కూలడంతో ఈ నష్టం వాటిల్లింది. వాహనాలు ప్రహరీ గోఢ శిధిలాల కింద కూరుకుపోవడంతో భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా తమ వాహనాల డ్యామేజీకి థియేటర్ యజమాన్యమే బాధ్యత వహించాలని వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
Water were flowing inside the shiva ganga theatre.Govt should focus on saroor nagar area @hydcitypolice @KTRTRS pic.twitter.com/y9Og4qPFJT
— RajuRathod ON DUTY (@rajunenavath1) October 9, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more