Lakhimpur Kheri Incident Ashish Mishra Appears Before SIT లఖీంపూర్ ఘటనపై విచారణకు హాజరైన అశీష్ మిశ్రా

Lakhimpur kheri violence minister s son escorted by many cops appears before sit

SIT on Lakhimpur violence, DIG Upendra Agarwal, Ashish Mishra Teni, UP violence updates, Lakhimpur Kheri violence, CJI NV Ramana, Supreme Court, ShivKumar Tripati, Lakhimpur Kheri, UP Lakhimpur Kheri updates, Lakhimpur Kheri news, Supreme Court, Lakhimpur Violence, UP Violence, UP Violence News, Lakhimpur-Kheri Violence, Lakhimpur kheri protest, Farmer Protest, Viral Video, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Lakhimpur Kheri Incident: After skipping the earlier summon, Ashish Mishra, son of Union Minister Ajay Mishra, appeared before the Special Investigation Team (SIT) formed in connection with the Lakhimpur Kheri violence case.

లఖీంపూర్ ఘటన: పోలీసుల ఎదుట హాజరైన కేంద్రమంత్రి తనయుడు

Posted: 10/09/2021 01:42 PM IST
Lakhimpur kheri violence minister s son escorted by many cops appears before sit

ల‌ఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ ఘటనకు కారకుడైయ్యాడని అరోపణలు ఎదుర్కోంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రెండో పర్యాయం నిన్న పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సిట్ పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఎట్ట‌కేల‌కు ఆయన ఇవాళ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వాస్తవానికి అశీష్ శక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన గైర్హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నను మీడియా ప‌లు ప్రశ్న‌లు అడ‌గ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా మాట్లాడ‌కుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్‌ లోప‌లికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, లఖీంపూర్ ఖేరీలో రైతుల మీదకు కారు దూసుకెళ్లినప్పుడు తాను ఆ కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేనని క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆశీష్ మిశ్రా స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను దంగల్ లో ఉన్నానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. దాంతో పాటు పది మంది సాక్షుల వాంగ్మూలాలనూ దానికి జత చేశారు. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆశిష్ ను విచారించింది.  

శుక్రవారం ఉదయం విచారణకు గైహాజరు కావడంపై ఆయన వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే తాను శుక్రవారం ఉదయం పోలీసు విచారణకు హాజరు కాలేకపోయానని అజయ్ మిశ్రా పేర్కోన్నారు. దీంతో అధికారులు తాజా సమన్లు ఇవ్వడంతో ఆయన విచారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. యూపీలోని లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఎవ‌రినీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles