ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్ లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ అగ్రనటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ ఖైదీల మదారిగానే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో జుడీషియల్ రిమాండ్ లో వున్నాడు. అయితే ఆయనకు ఇంటి బోజనం ఇచ్చేందుకు ఇప్పటికీ న్యాయస్థానం నుంచి ఎలాంటి అదేశాలు అందకపోవడంతో ఆయన జైలు బోజనాన్నే తీసుకుంటున్నాడు. ఆర్యన్ ఖాన్ తో పాటు ఆయన ఐదుగురు మిత్రులు ఆర్థర్ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా వున్నారు.
జైలులోని మొదటి అంతస్తులో ఉన్న బ్యారక్ నంబర్ వన్‌ను వీరికోసం కేటాయించారు. దీనిని క్వారంటైన్ సెల్‌గా ఉపయోగిస్తున్నారు. ఆర్యన్ ఇందులో ఐదు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడు. ప్రస్తుతానికి ఆర్యన్ అతని మిత్రులకు కరోనా నెగిటివ్ రిపోర్టు లభించింది. అయినా వీరు ఇక్కడ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని జైలు అధికారులు తెలిపారు. ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఆర్ఎం నెర్లికర్.. డ్రగ్స్ కేసులో అర్యన్ సహా అతని మిత్రులకు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపించిన విషయం తెలిసిందే.
ఆర్యన్ ను కూడా ఇతర ఖైదీల్లానే పరిగణిస్తామని జైలు అధికారులు ఇది వరకే తెలిపారు. కాగా ఇంటి జీవితానికి జైలు జీవితానికి వున్న వత్యాసం ఏంటో ఆర్యన్ కు ఇప్పుడు బోధపడనుంది. జైలులో సాధారణ ఖైదీల మాదిరిగానే ఆయనతో పాటు ఆయన మిత్రులు కూడా తెల్లవారుజామున 6 గంటలకే అధికారులు గంట మ్రోగించి మరీ నిద్ర లేపుతారు. ఏడు గంటలకల్లా అల్పాహారం చేయాల్సి వుంటుంది. కాగా అల్పాహారం తరువాత జైలు అవరణలో ఖైదీలు తిరిగే అవకాశం వున్నా.. ఆర్యన్ ఖాన్ అతని మిత్రులు క్వారంటైన్ లో ఉండటంతో వారికి మాత్రం తిరిగే అవకాశం లేదు. ఇక ఉదయం 11 గంటలకు మధ్యాహ్న బోజనం, సాయంత్రం ఆరు గంటలకు డిన్నర్ ఉంటుంది.
అల్పాహారంలో లో సాధారణంగా షీరా పోహా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చపాతి, కూర, పప్పు, అన్నం వడ్డిస్తారు. అయితే ఆర్యన్ కు కానీ అతని మిత్రులకు కానీ ఇంటి బోజనం పెట్టేందుకు న్యాయస్థానం అదేశాలు జారీ చేయలేదు. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప.. జైలు అధికారులు అందుకు అనుమతించరు. జైలు అధికారులు పెట్టే బోజనం రుచించకపోయినా.. లేక సరిపోక పోయినా జైలులోని క్యాంటిన్ లో అందుబాటులో వుండే ఇతర ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కాగా వాటికి డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. ఈ డబ్బు కూడా మనీ అర్డర్ ద్వారానే ఖైదీలకు అందాల్సివుంటుంది.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more