NCB Rejects Aryan Khan Bail Plea అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: బెయిల్ తిరస్కరించిన ఎన్సీబి కోర్టు

Mumbai drugs case court rejects bail plea of aryan khan

NCB court rejects aryan khan bail plea, Aryan khan bail plea rejected, NCB court, aryan khan, mumbai cruise drugs case, cordelia drugs case,Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Bollywood News, Hindi Movies News, aryan khan, sameer wankhede, ncb, Crime

The Narcotics Control Bureau is likely to seek further custody of Shah Rukh Khan's son Aryan Khan for investigation in the Cordelia drugs case. The NCB has said Aryan Khan's custody will be needed to investigate materials found during the overnight raids. The NCB is also going to seek further custody of two other accused in connection with the case.

అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: బెయిల్ తిరస్కరించిన ఎన్సీబి కోర్టు

Posted: 10/08/2021 08:07 PM IST
Mumbai drugs case court rejects bail plea of aryan khan

ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్ లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్న బాలీవుడ్ అగ్రన‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ కు మరోమారు ఎన్సీబి కోర్టులో చుక్కెదురైంది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్యన్ సహా ఎనిమిది మందికి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ తరఫు న్యాయవాది మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు.

ఇవాళ (అక్టోబర్ 8) వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్ సహా అర్భాజ్ ఖాన్, మూన్‌మూన్ ధమేచలకు బెయిల్ తిరస్కరించారు. అయితే బెయిల్ కోసం సెషన్ కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది న్యాయస్థానం. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వరాదని ఎన్సీబీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టును అభ్యర్థించారు. బెయిల్ పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని వాదనలు వినిపించారు.

మరోవైపు, అర్భాజ్ ఖాన్ న్యాయవాది సెషన్స్ కోర్టులో రేపు (అక్టోబర్ 9) పిటీషన్ దాఖలు చేయనున్నారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన మూన్మూన్ ధమేచా న్యాయవాది మాట్లాడుతూ.. మూన్మన్ మధ్యప్రదేశ్ కు చెందినవారిగా పేర్కొన్నారు. ముంబైకి ఆమెను ఆహ్వానించడం వల్లే ఇక్కడికి వచ్చారని కోర్టుకు తెలిపారు. ఎన్సీబీ దగ్గర ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని వాదించారు. అమెకు మాదకద్రవ్యాల కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు అమెను నిందితురాలిగా పేర్కోనడం ఆక్షేపనీయమన్నారు.

శుక్రవారం జరిగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు. ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకుంటుండగా ఆర్యన్ సహా మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబి అధికారులు అరెస్టు చేశారు. అప్పటినుంచి ఎన్‌సీబీ ఆఫీస్‌లోనే విచారించింది. ముంబై కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి అతన్ని తరలించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh