CBI court convicts Dera chief Ram Rahim డేరా బాబా హంతకుడే: పంచకుల కోర్టు తీర్పు.. 12న శిక్ష ఖరారు

Cbi court convicts dera chief ram rahim others in murder case

Dera Sacha Sauda chief, Gurmeet Ram Rahim Singh convicted murder case, special CBI court, Dera manager murder,Rohtak, Haryana, crime

A special CBI court in Panchkula on Friday convicted the Sirsa based sect Dera Sacha Sauda’s chief Gurmeet Ram Rahim and four others in a murder case of a former Dera functionary Ranjit Singh.

డేరా బాబా హంతకుడే: పంచకుల కోర్టు తీర్పు.. 12న శిక్ష ఖరారు

Posted: 10/08/2021 04:58 PM IST
Cbi court convicts dera chief ram rahim others in murder case

సిర్సా ఆధారిత వర్గం డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం హంతకుడేనని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్థారించింది. 2002 జులై 10 నాటి హత్య కేసులో తీర్పును వెలువరించిన న్యాయస్థానం.. ఇరువైపు వాదనలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఆయనను దోషిగా నిర్థారిస్తూ ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ హత్యకేసులో మరో నలుగురిని కూడా పంచకుల ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి సుశీల్ గార్గ్ దోషులుగా నిర్ధారించారు. ఇక ఈ కేసులో ఈ నెల 12న దోషులకు శిక్షను విధించనున్నారు.

2002 హత్య కేసుకు సంబంధించి డేరాబాబాతో పాటు మరో నలుగురు దోషులకు ఈ నెల 12న శిక్షలను ప్రకటించనున్నారు, 2002లో డేరా సచ్చా సౌధలో ఆయన ముఖ్య అనుచరుడు, తన మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేశారని రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదుమేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. కాగా ఈ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు.

కేసు వాదనలన్ని కొనసాగిన తరువాత కేసు విచారణను బదిలీ చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది.

బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. హెచ్‌పిఎస్ సిబిఐ న్యాయవాది వర్మ విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక సిబిఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ మరియు మరో నలుగురు నిందితులను సెక్షన్ 302 (హత్య) మరియు 120 బి (నేరపూరిత కుట్ర) కింద శిక్షించింది. ఈ కేసులో ఇతర నిందితులు క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్ లను కూడా దోషులుగా నిర్థారించిందని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు ఏడాది క్రితం మరణించాడని తెలిపారు. కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ ప్రస్తుతం హర్యానాలోని రోహ్‌తక్ సమీపంలోని సునారియా జైలులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles