20 killed, over 300 injured in earthquake in Pakistan పాకిస్థాన్ భూకంపం: 20 మంది మృతి.. 300 మందికి గాయాలు

20 killed hundreds injured as quake rattles southern pakistan

earthquake, Pakistan, baluchistan earthquake, quetta earth quake, toll in Quetta earth quake, earth quake in baluchistan province, Pakistan earthquake, southwest Pakistan, pakistan coal mines, Suhail Anwar Shaheen, Harnai, Baluchistan province, Quetta, death toll, Pakistan, Crime

Around 20 people were killed and more than 200 injured when a shallow earthquake hit southern Pakistan in the early hours of Thursday as people slept, government officials said. Many of the victims died when roofs and walls collapsed after the 5.7 magnitude quake struck in the Balochistan province, with a power cut forcing health workers to treat the injured using flashlights.

20 మందిని పోట్టనబెట్టుకున్న పాకిస్థాన్ భూకంపం.. 300 మందికి గాయాలు

Posted: 10/07/2021 01:18 PM IST
20 killed hundreds injured as quake rattles southern pakistan

పాకిస్థాన్ లో పెను విషాదం అలుముకుంది. పాక్ లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో భూకంపంతో పర్వత ప్రాంతమైన క్వెట్టా పట్టణం వణికిపోయింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాట్టిల్లిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ధాటికి 20 మంది అసువులు బాయగా, 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ప్రకంపనల ధాటికి శిధిలమైన భవనాల కింద ఉన్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ చెప్పారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా భూకంపం సంభవించిందని, భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు.

హర్నాయైలోని అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతినగా, 100 కి పైగా మట్టి ఇళ్లు కూడా కూలిపోయాయి, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే భూకంపం ధాటికి ఎంత మేర నష్టం వాటిల్లిందన్న విషయమై "ఖచ్చితమైన నష్టం" ఇంకా నిర్ధారించబడలేదని ఇది తెలిపింది. బలూచిస్తాన్‌లోని క్వెట్టా, సిబి, హర్నాయ్, పిషిన్, ఖిలా సైఫుల్లా, చమన్, జియారత్ మరియు జోబ్‌లలో భూకంపం సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భూప్రకంపనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

భూకంపం తరువాత క్వెట్టా నగరంలోని ప్రజలు వీధుల్లో ఉన్నారని సోషల్ మీడియాలో చిత్రాలు చూపించాయని అక్కడి పత్రికలు పేర్కోన్నాయి. కాగా, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి జామ్ కమల్ ఖాన్ అలియానీ మాట్లాడుతూ రెస్క్యూ అపరేషన్, తరలింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన రక్తం, అత్యవసర వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులను వేగంగా అసుపత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. 2015, అక్టోబర్‌ నెలలో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 400 మంది మృతిచెందారు. 2005, అక్టోబర్‌ 8న వచ్చిన భూకంపం వల్ల సుమారు 73 వేల మంది మరణించగా, 30.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles