CM KCR hands over B Form to Gellu Srinivas Yadav ఎమ్మెల్యేగా తిరిగోస్తాం: గెల్లుకు భీఫాం ఇచ్చి ఆశీర్వదించిన కేసీఆర్

Huzurabad bypoll cm kcr hands over b form to gellu srinivas yadav

TRS Party President, TRS KCR, Chief Minister K Chandrashekhar Rao, Gellu Srinivas Yadav, Harish Rao, PeddiReddy, Central Election Commission, by-election, Huzurabad by-election, Huzurabad bypoll, Huzurabad, By-polls, Telangana, Politics

TRS working president and Chief Minister K Chandrashekhar Rao handed over the B Form to Party’s Huzurabad Assembly bypoll candidate Gellu Srinivas Yadav. The bypoll will be held on October 30 and results would be announced on November 2.

ఎమ్మెల్యేగా తిరిగోస్తాం: గెల్లుకు భీఫాం ఇచ్చి ఆశీర్వదించిన కేసీఆర్

Posted: 10/01/2021 02:19 PM IST
Huzurabad bypoll cm kcr hands over b form to gellu srinivas yadav

తెలంగాణలోని హాట్ సీటుగా ప్రాధాన్యత సంతరించుకున్న రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగువారి దృష్టని ఆకర్షించింది హుజూరాబాద్ ఉపఎన్నిక. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప-ఎన్నికల నగరా మ్రోగడంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది కాబట్టి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తమ శక్తిమేరకు పార్టీలో నిర్వహించాయి. అయితే ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఈ ఇక ఇదే ఈ ఎన్నికలకు తుది ప్రచారం కానుంది. ఈ సీటులో కేసీఆర్ పంతం గెలుస్తుందా.? ఈటెల ఆత్మగౌరవం విజయం సాధిస్తుందా.? గెలుపెవరిదీ అన్న ఉత్కంఠ రేకెత్తుతోంది.

తెలంగాణ ప్రభుత్వంలో అరోగ్య మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాంటూ కొందరు రైతులు అరోపించారని, ఆయనను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న రాజకీయ సెగ ఈటెల పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ ఏడాది జూన్12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో హాటు రాజకీయాలకు హుజూరాబాద్ వేదికగా మారింది.

ఒకవైపు ఈటెల ఆయన బీజేపి పార్టీ నేతలతో ఉపఎన్నికల ప్రచారంలో చాపకింద నీరులా దూసుకుపోతున్నారు, మరోవైపు టీఆర్ఎస్ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అండగా ముమ్మరంగా ప్రచారం నిర్విహిస్తున్నారు. మరీ ముఖ్యంగా హరీశ్ రావు, గంగుల కమలాకర్ హుజూరాబాద్ లోనే తిష్టవేసిన మరీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే.. గెలుపుకు వ్యూహాలను కూడా రచిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ గెలుపు వైపు మార్గాన్ని నిర్ధేశిస్తున్నారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్‌కు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్నారు. అక్కడ మనదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 28 లక్షల చెక్కును ఈ సందర్భంగా శ్రీనివాస్ కు అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles