kid's poem on her 'smelly dad' will leave you in splits చిన్నారి పద్యం.. తెప్పించేను హాస్యం.. కనువిప్పు తథ్యం

5 year old girl writes hilarious poem about her smelly lazy dad

poem on dad, poem on father, funny poems on father, funny poem on dad, Hilarious Poem on dad, viral news, trending news, Viral Story

Arguably, one of the best qualities children possess is their honesty. While you can’t count on little ones to keep your secrets, you can always count on them to be brutally honest and unintentionally funny.

చిన్నారి పద్యం.. తెప్పించేను హాస్యం.. కనువిప్పు తథ్యం

Posted: 09/30/2021 10:06 PM IST
5 year old girl writes hilarious poem about her smelly lazy dad

పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులకు ముద్దే. వారి అల్లరి, ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతుంటారు. నా బంగారు కొండ అంటూ బుగ్గలు నిమిరి సంతోష పడిపోతుంటారు. అదే సమయంలో వారు మిమ్మల్ని గమనిస్తూ.. మీ అలవాట్లను తెలియకుండానే వారు అన్వయించేసుకుంటారు. అందుకనే వారి ఎదుట ఎవరినీ దూషించరాదని, అసభ్య పదజాలం వినియోగించరాదు. ఇక చిన్నారుల ముందు ఎలాంటి అసాంఘిక చర్యలు, అక్రమాలు, అవినీతి, అసత్యం కూడా చెప్పరాదు. అంతెందుకు ఇంట్లో చిన్నారులు ఉన్నారంటే వారి ఎదుట ఇంట్లోని సభ్యులపై కోపం, చికాకు, అసహనం ప్రదర్శించరాదు.

ఇలా చేస్తేనే మనలోని మంచి మాత్రమే వారు తమలో అన్వయించుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. అలా కాదని చిన్నారుల ఎదుట గోడవపడినా, అసభ్య పదజాలం వినియోగించినా.. అది మొత్తానికే మోసం చేస్తోంది. వారికి ప్రత్యేకించి ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు. వారు మారు మాట్లాడకుండా పిరశీలిస్తూనే అన్నింటినీ అర్థం చేసుకుంటారు. అన్వయించుకుంటారు. వారి పరిశీలనతోనే మనకు తెలియని అనేక మాటలు, భావాలు వారిలో కలుగుతాయి. అదెలా అంటే ఈ ఐదేళ్ల చిన్నారిలా. ఔనా ఈ చిన్నారి ఏం చేసిందంటారా.?

తన తండ్రిని ఎంత పరిశీలించిందో అమె రాసిన ఈ కవితే మీకు చెప్పేస్తోంది. అయితే ఈ కవితను అమె తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా విఫరీతంగా వైరల్ అయ్యింది. చిన్నపిల్లే అయినా రైమింగ్ పై పట్టు ఉన్నట్లు ఎక్కడా రైమింగ్ మిస్ అవ్వకుండా రాసిందా చిన్నారి.‘ ఈ కవితలో ఆ చిన్నారి ‘నా నాన్న ఫైజర్ అతను ఎప్పుడు వాడడు రేజర్ అంటూ స్టార్ట్ చేసింది. మానాన్నకు గడ్డం ఉంది. మా నాన్నకు తల బంతిలా ఉంటుంది.అతనికి విగ్ అవసరమని నేను అనుకుంటున్నా..మా నాన్నకు ఉంది పెద్ద కడుపు.. దాని నుంచి ఒక్కటే కంపు.. అయినా తన తండ్రిని తాను ప్రేమిస్తున్నానని పేర్కోంటూ ముగించింది. ఈ క‌విత‌ను మీరు కూడా చదవండీ..

My dad is called Frazer; he never uses a razor.
He has a beard-and he is really weird.
My dad is really small and his head is like a ball.
His ears are big and I think he needs a wig.
My dad is crazy and in the mornings he is lazy.
He has a big belly and is very smelly.”
“I love my dad, he’s a lovely lad.”

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles