Krishnapatnam Anandaiah to launch political party! సొంత రాజకీయపార్టీని స్థాపించనున్న ఆనందయ్య

Ayurvedic doctor krishnapatnam anandaiah to float a new political party

coronavirus, ayurvedic medicine, Bonige Anandaiah, krishnapatnam Anandaiah, YSR congress Party, Yadavs Political party, Andhra Pradesh, Politics

After popularising his medicine in Telugu states, the self-styled Ayurvedic practitioner Anandaiah from Krishnapatnam in Nellore district, had announced that he would soon launch a new political party in Andhra Pradesh. He alleged that the ruling YSRCP has not extended any cooperation to him in the distribution of his Krishnapatnam medicine.

సొంత రాజకీయపార్టీని స్థాపించనున్న ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య

Posted: 09/29/2021 12:14 PM IST
Ayurvedic doctor krishnapatnam anandaiah to float a new political party

క‌రోనా వైరస్.. ఈ మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని బలి తీసుకోగా, కోట్లాధి మందిని తన ప్రభావానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక కేసులు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ వ్యాధి నేపథ్యంలో పేదవారిని నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా తన ఆయుర్వేద మందును ఇస్తూ పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా మారిన వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. ఆయన తయారు చేసి అందించిన మందుతో అనేక మంది కోలుకున్నారు. ఆయన ఇచ్చిన మందు ఫలితాలు ఎలా వున్నాయె ప్రత్యక్షంగా పలువురు రోగులను మనం చూశాం.

ఆనందయ్య మందు కోసం ఎక్కడెక్కడి కరోనా బాధితులు నేరుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి క్యూకట్టారు. రవాణా మాద్యమాలు లేని సమయంలోనూ వారు ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని ఆనందయ్య మందు కోసం వచ్చారు. ఓవైపు అసుపత్రులు పేషెంట్ ను చూడనీయకుండా, వారి అరోగ్యంపై ఎలాంటి సమాచారం అందించకుండా.. వారి కుటుంబాల నుంచి లక్షలకోద్ది డబ్బను లాగేస్తున్నారన్న అరోపణలు వచ్చాయి. అంత డబ్బు పెట్టినా తమ వారి ప్రాణాలకు ఎలాంటి భరోసాను అసుపత్రి యాజమాన్యాలు కల్పించలేదు. దీంతో లక్షల వెచ్చించే స్థాయిలేక అనేక మంది ఆనందయ్య కోసం కృష్ణపట్నం బాటపట్టిన విషయం తెలిసిందే. దీంతోఆయన ఉంటున్న గ్రామం పెద్ద జాతరను తలపించింది.

అయితే రాష్ట్రంలోని ప్రజలందరీకీ కరోనాను నయం చేయగలిగేంత శక్తి తనకు తన గ్రామ ప్రజలకు వున్నా.. దానిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మందుకు హైకోర్టు అనుమతి లభించినా.. ఆయుష్ అభ్యంతరాలు లేవని చెప్పినా.. దానిని కావాలనే ప్రభుత్వం, అధికార యంత్రంగాన్ని అడ్డుపెట్టుకుని మురుగున పడేట్లు చేసిందని ఆయన అరోపించారు. తన కరోనా మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బిసీలు ఒక వేదికపైకి రావాల్సిన తరుణం ఏర్పడిందని, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా తాను రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు.

విజయనగరంలో జరిగిన యాదవ మహాసభ సమితి కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన మందును అడ్డుకునేందుకు ఇన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమివచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాను పార్టీని స్థాపించనున్నానని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రధయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత పార్టీని పెట్టె అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles