శనకాలకు ఆటలకు చాలా దగ్గరి సంబంధం వుంది. అవి తమ యజమానులతో కలసి ఆటలు ఆడాలని నిత్యం వేచిచూస్తుంటాయి. ఈ క్రమంలో తమ యజమానులకు దెబ్బలు తగలడానికి కూడా కారణమౌతుంటాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఇప్పటికే మనం చేశాం. అయితే కుక్కలకు గ్రౌండ్ లో గేమ్స్ ఆడాలని ఎందుకు అంత ఉబలాటమో తెలియదు కానీ ఇటీవల మహిళల టీ-20 మ్యాచ్ మధ్యలోకి వెళ్లి బంతిని తన నోట కరుచుకుని వెళ్లిన శునకం గుర్తుందిగా.. నేరుగా వెళ్లి రన్నర్ బ్యాట్స్ ఉమెన్ చేతికి బంతిని అందించింది.
సరిగ్గా అదే మాదిరిగా న్యూయార్క్ లోని బఫెలోలో జరిగిన మైనర్ లీగ్ బేస్ బాల్ ఆటలో మరో శునకం కూడా ఆటకు అంతరాయం కలిగించింది. అయితే ఆకస్మాత్తుగా ఆట మధ్యలో రూకీ అనే శునకం రావడంతో మ్యాచ్ ఆగినా నవ్వుల పువ్వులు వెల్లివిపిరాయి. దీంతో అద్భుతమైన వాతావరణం అలుముకుంది. రూకీ అనే గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజనులు ఈ వీడియోపై కామెంట్లు, లైకుల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు తమ అకౌంట్లలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.
ఇంతకీ న్యూయార్క్ లో ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. భపెలో లోని ఓ క్రీడామైదానంలో బఫెలో బైసన్స్ కు.. లేహీ వ్యాలీ ఐరన్పిగ్స్ మధ్య గేమ్ జరుగుతుండగా ఈ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. ట్రెంటన్ థండర్ కోసం గబ్బిలాలు తీసుకురావడానికి రూకీని అక్కడి అధికారులు నియమించారు. అయితే గబ్బిలాలు లేకపోవడంతో రూకీ.. బఫెలో బేస్ బాల్ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతేకాదు బఫెలోలో నిర్వహించిన "డాగ్ డే" కోసం ఉత్సాహాన్ని కలిగివున్నాడని నెటిజనులు కామెంట్లు పెట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియోను మైనర్ లీగ్ బేస్‌బాల్ ద్వారా ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ 23-సెకన్ల వీడియోలో తొలిసారిగా కుక్క మైదానంలోకి దూసుకెళ్లి, కొద్దిసేపు ఆటను నిలిపివేసింది. పక్కకి తిరిగి వచ్చే ముందు రూకీ సంతోషంగా గడ్డి మీద ఎగరడం మనం చూడవచ్చు. బఫెలో బైసన్స్తో రూకీ "తన సహెలెన్ ఫీల్డ్ అరంగేట్రం సమయంలో కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు" అనే శీర్షికతో వారు ఈ వీడియోను పోస్టు చేశారు. ఆటకు ఆటంకం కలిగించినా "మేము ఇంకా అతన్ని ప్రేమిస్తున్నాము" అంటూ ట్రెంటన్ థండర్ ను కూడా మైనర్ లీగ్ బేస్ బాల్ ట్యాగ్ చేసింది. ఈ వీడియో 5 లక్షలకు పైగా వీక్షణలను మరియు 5,000 కంటే ఎక్కువ 'లైక్‌లను' సంపాదించింది. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను వీక్షించండీ..
.@BatdogRookie got a little excited during his Sahlen Field debut with the @BuffaloBisons
— Minor League Baseball (@MiLB) September 22, 2021
We still love him @TrentonThunder. pic.twitter.com/2KJn8OnxNK
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more