Spy Cam Found in Women’s Washroom at a Restaurant రెస్టారెంట్ల్ లేడీస్ వాష్ రూములో స్పై కెమెరా

Hidden camera phone found in women s washroom at jubilee hills drive in restaurant

Drive-In Restaurant, hidden camera, Hidden Camera Phone, Ladies Washroom, phone, restaurant, Washroom, Jubilee Hills, Hyderabad, Telangana

An employee of a drive-in restaurant in Hyderabad was arrested on Wednesday after a hidden camera phone with its recording switched on was found in the women's washroom. A female customer of the restaurant in posh Jubilee Hills lodged a complaint with the police after she found the hidden camera in an overhead shelf of the washroom.

హైదరాబాద్ రెస్టారెంట్ల్ లేడీస్ వాష్ రూములో స్పై కెమెరా

Posted: 09/23/2021 04:24 PM IST
Hidden camera phone found in women s washroom at jubilee hills drive in restaurant

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ లోని వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాను ఓ యువతి గుర్తించింది. వెంటనే యువతి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్ యజమాని చైతన్య, ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల నుంచి కెమెరా అక్కడ ఉంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడు. హౌస్‌కీపర్‌ బెనర్జీ మైనర్ కావడం గమనార్హం. అతనే స్పై క్యామ్ పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్పై క్యామ్ లో ఐదు గంటల డేటా ఉంది. స్పై క్యామ్‌ విషయంలో హౌస్‌కీపర్‌ని అరెస్ట్ చేసినా.. రెస్టారెంట్‌లో అసలు సీసీ కెమెరా బ్యాకప్‌ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపైన కూడా అనుమానాలకు తావిస్తోంది. అందుకే హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. హౌస్ కీపర్ బెనర్జీ సీక్రెట్ కెమెరా అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది యువతుల నగ్నదృశ్యాలు సీక్రెట్ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం బెనర్జీ, చైతన్యను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles