Sandy Saha lands in trouble for dancing on Flyover ప్లైఓవర్ పై డాన్స్.. వీడియో వైరల్.. చుట్టుముట్టిన కష్టాలు

Kolkata influencer sandy saha fined for dancing and filming video on flyover

sandy saha Maa Flyover, Kolkata influencer sandy saha, Dance on road Sandy saha, Ma flyover Kolkata, Sandy Saha, Sandy Saha controversy, social media influencer, Kolkata, Viral videos

Sandy Saha, a social media influencer based in Kolkata has been fined for dancing on the city’s Ma flyover amid heavy traffic. The video went viral after it was posted by Saha from his social media accounts.

ITEMVIDEOS: ప్లైఓవర్ పై డాన్స్.. సోషల్ మీడియాలో వీడియో.. చుట్టుముట్టిన కష్టాలు

Posted: 09/23/2021 12:14 PM IST
Kolkata influencer sandy saha fined for dancing and filming video on flyover

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ యూట్యుబర్ నడిరోడ్డుపై డాన్స్ చేసి కష్టాలు కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇండోర్ లో రద్దీ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో శ్రేయ కల్రా అనే యూట్యూబర్ వెళ్లి ఓ పాటకు డాన్స్ చేసింది. అది కాస్తా నెట్టింట్లో వైరల్ కావడంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి.. రద్దీ రోడ్డుపై డాన్స్ చేయడంపై మండిపడిన మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి అమెకు తాఖీదులు పంపాలని పోలీసులను అదేశించారు దీంతో అమె ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తోంది. అయితే అమె వీడియో మాత్రం నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోట్టింది.

శ్రేయా కల్రా వీడియో ఎంతగా చక్కర్లు కొట్టిందన్న విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న యూట్యూబర్లు ఇప్పుడు అమె బాటలోనే పయనించాలని ఫ్లాన్ చేస్తున్నారు. అయితే అమె ఎదుర్కోన్న తాఖీదుల గురిచి తెలిసి కొందరు ఈ తరహా వీడియోలను చేయడాన్ని విరమించుకుంటే.. కొల్ కతాకు చెందిన యూట్యూబర్ మాత్రం అమె బాటను ఫాలో అయ్యి.. అమె మాదిరిగానే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఇంతకీ ఎవరా యూట్యూబర్, ఏమా కథ.. ఇంతకీ అమె ఎక్కడా డాన్స్ చేసింది.? ఈ వివరల్లోకి ఎంట్రీ ఇస్తే..

పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కతాకు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ సాండీ సాహా అనే ట్రాన్స్ జెండర్ గతంలో కొండ ప్రాంతాలు, నదీతీరాల్లో రీల్స్‌ చేసి పోస్టు చేసేది. ఈమె కొత్త ఫీట్లను చూసి మెచ్చిన ఫాలోవర్లు అమెకు లైకులు, కామెంట్ల రూపంలో మరికొన్ని ఐడియాలు కూడా పంచుకునేవారు. అయితే శ్రేయకల్రా వీడయో చూసిందో ఏమో తెలియదు కానీ.. అలాంటి ఫీట్ చేయాలని భావించింది. అంతేకాదు ఊరికే చేస్తూ మజా రాదనుకుందో ఏమో కానీ.. ఇలాంటి ఫీట్ ను వర్షం పడే సమయంలో చేయాలని ప్లాన్ చేసింది.

అనుకున్న విధంగానే ఓ రోజు వర్షం పడుతుండగా, వర్షంలో తడస్తూ.. ఆడుతూ.. సరదా డాన్స్ చేసింది. అయితే ఇదేదో తన ఇంటిముందో.. లేక ఇంట్లోనే కాదు.. ఏకంగా తన వీడియోకు లైకుల వర్షం కురవాలని ప్లాన్ చేసిన ఆమె కొలకత్తాలోని మా ఫ్లైఓవర్ పై తన కారును నిలిపి.. అక్కడే వున్న డివైడర్ పై నిల్చుని డాన్స్ చేసింది. దీంతో అమె సరదా తీరిపోయిందనుకుంది. కానీ, అప్పుడే చిక్కులు మొదలయ్యాయి. ఈ విడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అమెకు పోలీసులు తాఖీదులు అందించారు. దీంతో అమె కూడా ప్రస్తుతం శ్రేయ కల్రా మాదిరిగానే న్యాయపోరాటం చేస్తోంది.

ఇన్ స్టాగ్రామ్‌లో 2లక్షల60వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ట్రాన్స్‌జెండర్‌ సాండీ సాహా తన వీడియో నెట్టింట్లో ఈ నెల 13న పోస్ట్ చేయగానే అది కాస్తా వారం రోజుల వ్యవధిలో వైరల్ అయ్యింది. రద్దీగా ఉన్న ఫ్లైఓవర్‌పై కారు నిలిపి.. విచిత్రమైన హావభావాలు పలికిస్తూ… డివైడర్‌ మీదకు వెళ్లి డ్యాన్స్‌ చేయడం మొదలెట్టింది. ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్ లలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా పోలీసు అధికారులు దృష్టికి చేరింది. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీ ద్వారా కారు ఓనర్ ని గుర్తించారు. సాహానే దాని యజమాని అని గుర్తించి అమెకు నోటీసులు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles